దట్టమైన అడవిలో, అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మీద వున్నట్టుండి ఆగిపోయింది శ్యామ్ సుందర్ నడుపుతున్న అంబాసిడర్ కారు.
డైనమిక్ సిటీ సెక్యూరిటి సర్వీసెస్ సంస్థలో పార్టనర్ అతను. తమ సంస్థ పనిమీద ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణానికి వెళ్లివస్తుండగా జరిగిపోయింది ఆ దారుణం.
పొద్దున్నే నిద్ర లేచీలేవగానే ఎవరి ముఖం చూసి వుంటాడో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ, స్టిరింగ్ ముందునుంచి దిగి, రోడ్డుమీద నిలబడ్డాడతను.
ఆరుగంటలు దాటి పన్నెండు నిముషాలు అయినట్లు సూచిస్తోంది అతని రిస్ట్ వాచి. మరో నాలుగైదు నిముషాల్లో చుట్టుముట్టేందుకు సిద్ధం అవుతున్నాయి చీకట్లు.
పగటి సమయంలో పరమ నిశ్శబ్దంగావున్న ఆ అడవిప్రదేశం, చీకటి సమయం దగ్గిరపడుతున్న కొద్దీ, రకరకాల శబ్దాలతో నిండిపోవటం మొదలుపెట్టింది.
ఎలుగుబంటి గురకలు, దూరంలో ఎక్కడో ఏదో చెట్టుమీదికి ఎక్కి కూర్చున్న చిరుతపులి గాండ్రింపులు స్పష్టంగా చేరాయి శ్యామ్ సుందర్ చెవులకు.
ఈ పరిస్థితిల్లో శ్యామ్ సుందర్ జీవితం ఏమైందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "సాలభంజిక".
- మధుబాబు
దట్టమైన అడవిలో, అత్యంత ప్రమాదకరమైన ఘాట్ రోడ్డు మీద వున్నట్టుండి ఆగిపోయింది శ్యామ్ సుందర్ నడుపుతున్న అంబాసిడర్ కారు. డైనమిక్ సిటీ సెక్యూరిటి సర్వీసెస్ సంస్థలో పార్టనర్ అతను. తమ సంస్థ పనిమీద ఒరిస్సా రాష్ట్రంలోని కటక్ పట్టణానికి వెళ్లివస్తుండగా జరిగిపోయింది ఆ దారుణం. పొద్దున్నే నిద్ర లేచీలేవగానే ఎవరి ముఖం చూసి వుంటాడో గుర్తు తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తూ, స్టిరింగ్ ముందునుంచి దిగి, రోడ్డుమీద నిలబడ్డాడతను. ఆరుగంటలు దాటి పన్నెండు నిముషాలు అయినట్లు సూచిస్తోంది అతని రిస్ట్ వాచి. మరో నాలుగైదు నిముషాల్లో చుట్టుముట్టేందుకు సిద్ధం అవుతున్నాయి చీకట్లు. పగటి సమయంలో పరమ నిశ్శబ్దంగావున్న ఆ అడవిప్రదేశం, చీకటి సమయం దగ్గిరపడుతున్న కొద్దీ, రకరకాల శబ్దాలతో నిండిపోవటం మొదలుపెట్టింది. ఎలుగుబంటి గురకలు, దూరంలో ఎక్కడో ఏదో చెట్టుమీదికి ఎక్కి కూర్చున్న చిరుతపులి గాండ్రింపులు స్పష్టంగా చేరాయి శ్యామ్ సుందర్ చెవులకు. ఈ పరిస్థితిల్లో శ్యామ్ సుందర్ జీవితం ఏమైందో తెలుసుకోవాలంటే చదవండి ఆసక్తికరమైన నవల "సాలభంజిక". - మధుబాబు© 2017,www.logili.com All Rights Reserved.