లేలేత మొగ్గలు సహజసిద్ధంగా వికసించి... మృదు పరిమళాలు వేదజల్లటమే కదా ప్రకృతి ధర్మం... దానికి విరుద్ధంగా బలవంతంగా వికసింపజేయాలని ప్రయత్నిస్తే వికృత ఫలితాలే వస్తాయి. విద్యార్థుల మేధో వికాసాన్ని నియంత్రించి, వాళ్ళని మార్కులు తెచ్చుకునే మర యంత్రాలుగా మారుస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థల 'పడగనీడ' ని కళ్ళకు కట్టేలా చిత్రించిందీ నవల.
ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పట్టి పిడుస్తున్న రుగ్మత 'యంసెట్ మానియా'. తమ పిల్లలు ఇంజనిర్లో, డాక్టర్లో అయ్యాక రెండు చేతులా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళని సృజనశీలత గల మేధావులుగా, మానవత్వం ఉన్న మంచి మనుషులుగా తీర్చిదిద్దాలని ఆశించకపోవటం ఎంతటి అపరాధం! విద్యాలయాలిప్పుడు విద్యనందించే పవిత్రమైన ఆలయాలు కాదు... ర్యాంకుల కోసం పసి హృదయాల్ని హింసిస్తున్న జైళ్ళు... విపరీతమైన పోటి... భరించలేనంత వత్తిడి... తల్లిదండ్రుల ఛిత్కారాలు... టీచర్ల తిట్లూ, అవహేళనలు... ఎన్నిటినని సహిస్తారు పాపం... చివరికి ఆత్మహత్యలే శరణ్యమనుకుని వికసించకుండానే రాలిపోతున్న సుమాలెన్నో...
చదువుని మార్కెట్ వస్తువు చేసి, తల్లిదండ్రుల కలల్ని కసులుగా మార్చుకుంటున్న కార్పోరేట్ విద్యాసంస్థల నైజాన్ని బైటపెట్టి, చదువంటే మార్కులూ, ర్యాంకులు కాదనీ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించేదే అసలైన చదువని చెప్పిన నవల 'పడగనీడ'.
- సలీం
లేలేత మొగ్గలు సహజసిద్ధంగా వికసించి... మృదు పరిమళాలు వేదజల్లటమే కదా ప్రకృతి ధర్మం... దానికి విరుద్ధంగా బలవంతంగా వికసింపజేయాలని ప్రయత్నిస్తే వికృత ఫలితాలే వస్తాయి. విద్యార్థుల మేధో వికాసాన్ని నియంత్రించి, వాళ్ళని మార్కులు తెచ్చుకునే మర యంత్రాలుగా మారుస్తున్న కార్పోరేట్ విద్యాసంస్థల 'పడగనీడ' ని కళ్ళకు కట్టేలా చిత్రించిందీ నవల. ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రుల్ని పట్టి పిడుస్తున్న రుగ్మత 'యంసెట్ మానియా'. తమ పిల్లలు ఇంజనిర్లో, డాక్టర్లో అయ్యాక రెండు చేతులా డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నారు తప్ప వాళ్ళని సృజనశీలత గల మేధావులుగా, మానవత్వం ఉన్న మంచి మనుషులుగా తీర్చిదిద్దాలని ఆశించకపోవటం ఎంతటి అపరాధం! విద్యాలయాలిప్పుడు విద్యనందించే పవిత్రమైన ఆలయాలు కాదు... ర్యాంకుల కోసం పసి హృదయాల్ని హింసిస్తున్న జైళ్ళు... విపరీతమైన పోటి... భరించలేనంత వత్తిడి... తల్లిదండ్రుల ఛిత్కారాలు... టీచర్ల తిట్లూ, అవహేళనలు... ఎన్నిటినని సహిస్తారు పాపం... చివరికి ఆత్మహత్యలే శరణ్యమనుకుని వికసించకుండానే రాలిపోతున్న సుమాలెన్నో... చదువుని మార్కెట్ వస్తువు చేసి, తల్లిదండ్రుల కలల్ని కసులుగా మార్చుకుంటున్న కార్పోరేట్ విద్యాసంస్థల నైజాన్ని బైటపెట్టి, చదువంటే మార్కులూ, ర్యాంకులు కాదనీ జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కొనే నమ్మకాన్ని, ఆత్మస్థైర్యాన్ని అందించేదే అసలైన చదువని చెప్పిన నవల 'పడగనీడ'. - సలీం© 2017,www.logili.com All Rights Reserved.