రక్తాన్నంతా తాగిస్తుంటే
భూమికి నీటితో ద్వేషం పుడతది.
పిడుగులనే తలపించేస్తుంటే
మేఘాన్నే గగనం ఎదురిస్తుంటది.
దుర్మార్గం అవధులు దాటేస్తుంటే
నిజాయితి నిప్పై కాల్చేస్తుంటది.
మోసపు గాయం ముదురుతు ఉంటే
నొప్పుల కేక నినాదమౌతది.
నమ్మకమంతా వమ్మవుతుంటే
నినాదపు అరుపు ఉద్యమమవుతది.
- సిరిసిల్లాగపూర్ శిక్షక్ కవిత్వం
రక్తాన్నంతా తాగిస్తుంటే భూమికి నీటితో ద్వేషం పుడతది. పిడుగులనే తలపించేస్తుంటే మేఘాన్నే గగనం ఎదురిస్తుంటది. దుర్మార్గం అవధులు దాటేస్తుంటే నిజాయితి నిప్పై కాల్చేస్తుంటది. మోసపు గాయం ముదురుతు ఉంటే నొప్పుల కేక నినాదమౌతది. నమ్మకమంతా వమ్మవుతుంటే నినాదపు అరుపు ఉద్యమమవుతది. - సిరిసిల్లాగపూర్ శిక్షక్ కవిత్వం© 2017,www.logili.com All Rights Reserved.