భారతీయ సంస్కృతి, నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం పురాణం అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలూ, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే మనవదండాలు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే. కృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణ సాహిత్యం అంటే అష్టాదశ మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం. అష్టాదశ మహాపురాణాలలో 14వ పురాణం శ్రీవామన మహాపురాణం.
సుమారు 6000లకు పైగా శ్లోకాలుగల ఈ పురాణం, పురాణాలలో అతిచిన్నది. అయినా ఇందులో అనేక ప్రత్యేక విషయాలు వివరించబడ్డాయి. చక్కని కావ్యశైలిలో వర్ణించబడిన పార్వతీ కళ్యాణం. వామనావతారం గురించిన సవివర విశేషాలు, భువనకోశం, దేవీమహత్యం దేవాసుర యుద్ధాలు కురుక్షేత్రం అందులోని తీర్థాలు, అనేక వ్రతాలు, స్తోత్రాలు, అఖ్యనాలు, ఉపాఖ్యానాలు మొదలైన పౌరాణిక విశేషాలను తెలియజేసే పురాణం ఈ శ్రీ వామన మహాపురాణం. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ప్రతిపాదకమైన ఈ పురాణం తేటతెలుగు వచనంలోనికి తీసుకొని రాయబడింది.
భారతీయ సంస్కృతి, నాగరికత, చరిత్రలను గురించిన సంపూర్ణ జ్ఞానం కోసం పురాణం అధ్యయనం తప్పనిసరి. పురాణాలు ఈ ప్రాచీన దేశపు సంస్కృతి, ఆచార వ్యవహారాలూ, నాగరికత, చరిత్రలను గురించి తెలిపే మనవదండాలు. వీటిని క్షుణ్ణంగా తెలుసుకొనని ఎటువంటి అధ్యయనమైనా, భారతదేశానికి సంబంధించినంత వరకు అసంపూర్ణమే. కృష్ణద్వైపాయన వేదవ్యాస మహర్షి కృతమైన భారతీయ పురాణ సాహిత్యం అంటే అష్టాదశ మహాపురాణాలు, ఉపపురాణాలు, ఔపపురాణాలు గల మొత్తం సాహిత్యం. అష్టాదశ మహాపురాణాలలో 14వ పురాణం శ్రీవామన మహాపురాణం. సుమారు 6000లకు పైగా శ్లోకాలుగల ఈ పురాణం, పురాణాలలో అతిచిన్నది. అయినా ఇందులో అనేక ప్రత్యేక విషయాలు వివరించబడ్డాయి. చక్కని కావ్యశైలిలో వర్ణించబడిన పార్వతీ కళ్యాణం. వామనావతారం గురించిన సవివర విశేషాలు, భువనకోశం, దేవీమహత్యం దేవాసుర యుద్ధాలు కురుక్షేత్రం అందులోని తీర్థాలు, అనేక వ్రతాలు, స్తోత్రాలు, అఖ్యనాలు, ఉపాఖ్యానాలు మొదలైన పౌరాణిక విశేషాలను తెలియజేసే పురాణం ఈ శ్రీ వామన మహాపురాణం. ధర్మ, అర్థ, కామ, మోక్ష, ప్రతిపాదకమైన ఈ పురాణం తేటతెలుగు వచనంలోనికి తీసుకొని రాయబడింది.© 2017,www.logili.com All Rights Reserved.