చైనా ప్రజలు అజేయులు. ఎన్ని తుఫానులు వచ్చినా మొక్కలు వంగుతాయే తప్ప విరగవు. వాళ్ళు అంతే
..... పెరల్ బక్
1949 నాటి విప్లవానికి ముందు దశకాల్లోని చైనా గ్రామీణ జీవితానికి, ముఖ్యంగా నిరుపేదల జీవన పోరాటానికి అద్దం పట్టింది. "సుక్షేత్రం" (ది గుడ్ ఎర్త్). 1931 లో తొలిసారిగా అచ్చయిన ఈ నవల, 1932 లో అమెరికాలోని అత్యున్నత సాహితీ పురస్కారం పులిట్జర్ ప్రైజ్ అందుకుని ఇప్పటికే అల్ టైం బెస్ట్ సెల్లర్ లలో ఒకటిగా నిల్చింది.
ఇది, కష్టాలకడలిని ఈదిన బడుగు రైతు వాంగ్ లుంగ్ సాహస గాధ.అతడి భార్య జమిందార్ల ఇంట్లో బానిస. దుర్బర జీవితానికి పరాకాష్ట ఇది. కష్టాలేప్పుడు ఒంటరిగా రావు. - అన్న సామెతను నిజం చేస్తూ ఆ ఏడు కరువు కూడా వస్తుంది. జనం ఆకలి తో అలమటించి పోతారు. ఎవరికీ కూలి దొరకదు. నగరాలకు వలస పోక తప్పదు. అయితే పట్టణాల తళుకు బెలుకులే తప్ప అక్కడా కడుపు నిండదు. కొందరు రిక్షా కూలీలుగా, మరికొందరు ముష్టివాళ్ళుగా మారతారు.
ఆకలిదాడులు అనివార్యమవుతాయి. గంజి కేంద్రాలలో నిత్యం పోట్లాటలే. స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోతారు అన్నార్తులు.
పేదలకు బతుకంటేనే లేమితో చెలిమి. కడగండ్లను అధిగమించి, కష్టించి పనిచేసేవాడు, భూమిని నమ్ముకున్నవాడిదే అంతిమ విజయం. దురలవాట్లకు బానిసలై పతనమవుతుంది జమీందార్ల కుటుంబం. దురదృష్టాన్ని, క్షామాన్ని తట్టుకుని తన పొలాన్ని సుక్షేత్రంగా మార్చుకున్న వాంగ్ లుంగ్ - పట్టుదల, అకుంటిత కృషి వుంటే సాధించలేనిదేదీ లేదని రుజువు చేస్తాడు. అత్యంత ప్రతిభావంతమైన కధనంతో, ఉద్వేగభరితంగా సాగే ఈ నవల ఒకసారి ప్రారంబిస్తే ముగించకుండా ఉండలేరు.
... ముక్తవరం పార్ధ సారధి
చైనా ప్రజలు అజేయులు. ఎన్ని తుఫానులు వచ్చినా మొక్కలు వంగుతాయే తప్ప విరగవు. వాళ్ళు అంతే ..... పెరల్ బక్ 1949 నాటి విప్లవానికి ముందు దశకాల్లోని చైనా గ్రామీణ జీవితానికి, ముఖ్యంగా నిరుపేదల జీవన పోరాటానికి అద్దం పట్టింది. "సుక్షేత్రం" (ది గుడ్ ఎర్త్). 1931 లో తొలిసారిగా అచ్చయిన ఈ నవల, 1932 లో అమెరికాలోని అత్యున్నత సాహితీ పురస్కారం పులిట్జర్ ప్రైజ్ అందుకుని ఇప్పటికే అల్ టైం బెస్ట్ సెల్లర్ లలో ఒకటిగా నిల్చింది. ఇది, కష్టాలకడలిని ఈదిన బడుగు రైతు వాంగ్ లుంగ్ సాహస గాధ.అతడి భార్య జమిందార్ల ఇంట్లో బానిస. దుర్బర జీవితానికి పరాకాష్ట ఇది. కష్టాలేప్పుడు ఒంటరిగా రావు. - అన్న సామెతను నిజం చేస్తూ ఆ ఏడు కరువు కూడా వస్తుంది. జనం ఆకలి తో అలమటించి పోతారు. ఎవరికీ కూలి దొరకదు. నగరాలకు వలస పోక తప్పదు. అయితే పట్టణాల తళుకు బెలుకులే తప్ప అక్కడా కడుపు నిండదు. కొందరు రిక్షా కూలీలుగా, మరికొందరు ముష్టివాళ్ళుగా మారతారు. ఆకలిదాడులు అనివార్యమవుతాయి. గంజి కేంద్రాలలో నిత్యం పోట్లాటలే. స్వదేశంలోనే కాందిశీకులుగా మారిపోతారు అన్నార్తులు. పేదలకు బతుకంటేనే లేమితో చెలిమి. కడగండ్లను అధిగమించి, కష్టించి పనిచేసేవాడు, భూమిని నమ్ముకున్నవాడిదే అంతిమ విజయం. దురలవాట్లకు బానిసలై పతనమవుతుంది జమీందార్ల కుటుంబం. దురదృష్టాన్ని, క్షామాన్ని తట్టుకుని తన పొలాన్ని సుక్షేత్రంగా మార్చుకున్న వాంగ్ లుంగ్ - పట్టుదల, అకుంటిత కృషి వుంటే సాధించలేనిదేదీ లేదని రుజువు చేస్తాడు. అత్యంత ప్రతిభావంతమైన కధనంతో, ఉద్వేగభరితంగా సాగే ఈ నవల ఒకసారి ప్రారంబిస్తే ముగించకుండా ఉండలేరు. ... ముక్తవరం పార్ధ సారధి
© 2017,www.logili.com All Rights Reserved.