టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి నిర్వహించిన సోసాకు కొబయాషి గురించి రాయడం, నేను చాలా కాలంగా చెయ్యాలనుకున్న ముఖ్యమైన పనుల్లో ఒకటి.
నేను చెప్పిన దానిలో అభూత కల్పనలు లేవు. అన్నీ వాస్తవాలే. జరిగిన సంఘటనలే. చాలా సంఘటనలు ఇంకా గుర్తుండడం నా అదృష్టం. నేను చేసిన ఒక వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాను. అది నేను పెద్దయ్యాక టోమో బడిలో పని చేస్తానని చేసిన వాగ్దానం. అందుకే కొబయాషి గురించి, అయన పిల్లల పట్ల చూపిన ప్రగాడమైన ప్రేమ గురించి, విద్యార్దుల్ని విజ్ఞానవంతుల్ని చెయ్యడానికి అయన అమలు పరిచిన పద్దతుల గురించి, వీలయినంత ఎక్కువ మందికి తెలియజెప్పాలనే ప్రయత్నమే ఇది. జపాన్ లో లోక ప్రియత్వాన్ని చూరగొన్న ఈ పుస్తకం, బలమైన గొంతుతో ఈ విధంగా చెబుతోంది -
" వేల వేల పుష్పాలను వికసించ నివ్వండి
వేల వేల ఆలోచనలను సంఘర్శించనివ్వండి."
- టెట్సూకో కోరియనాగి
టోమో అనే బడి గురించి, దాన్ని స్థాపించి నిర్వహించిన సోసాకు కొబయాషి గురించి రాయడం, నేను చాలా కాలంగా చెయ్యాలనుకున్న ముఖ్యమైన పనుల్లో ఒకటి. నేను చెప్పిన దానిలో అభూత కల్పనలు లేవు. అన్నీ వాస్తవాలే. జరిగిన సంఘటనలే. చాలా సంఘటనలు ఇంకా గుర్తుండడం నా అదృష్టం. నేను చేసిన ఒక వాగ్దానాన్ని నెరవేర్చలేకపోయాను. అది నేను పెద్దయ్యాక టోమో బడిలో పని చేస్తానని చేసిన వాగ్దానం. అందుకే కొబయాషి గురించి, అయన పిల్లల పట్ల చూపిన ప్రగాడమైన ప్రేమ గురించి, విద్యార్దుల్ని విజ్ఞానవంతుల్ని చెయ్యడానికి అయన అమలు పరిచిన పద్దతుల గురించి, వీలయినంత ఎక్కువ మందికి తెలియజెప్పాలనే ప్రయత్నమే ఇది. జపాన్ లో లోక ప్రియత్వాన్ని చూరగొన్న ఈ పుస్తకం, బలమైన గొంతుతో ఈ విధంగా చెబుతోంది - " వేల వేల పుష్పాలను వికసించ నివ్వండి వేల వేల ఆలోచనలను సంఘర్శించనివ్వండి." - టెట్సూకో కోరియనాగి© 2017,www.logili.com All Rights Reserved.