ఉదయం పది గంటల సమయంలో సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ ముందు టాక్సీ దిగింది వాసంతి. ఒక కరెన్సీ నోటును డ్రయివర్ కి అందించి, మెయిన్ గేటును క్రాస్ చేయబోతుండగా, పరుగు పరుగున వచ్చి, ఆమెను పలుకరించాడు కాలేషావలీ. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ పనిచేసే బిల్డింగ్ ఎదురుగా, రోడ్డుకు అవతలివైపున ఒక కిళ్ళీ బడ్డీని నడుపుకుంటూ ఉంటాడతను. 'ఈ రోజు నేను బడ్డీని తెరిచిన దగ్గర్నించీ ఇప్పటివరకూ నాలుగు సార్లు మన ఆఫీసు దగ్గరకు వచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరో నాకు అర్థం కాలేదు'.. అంటూ తను చూసిన విషయాన్ని రిపోర్ట్ చేశాడతను. అందంగా నవ్వి అలాగేనని అన్నట్టు తల ఊపింది వాసంతి. అప్పటికీ అవతలికి పోలేది కాషావలీ. వాళ్ళు ఎవరోగాని చాల రఫ్ గా కనిపిస్తున్నారమ్మా.. ఎందుకయినా మంచిది మీరు కాస్తంత ఎలర్ట్ గా ఉండాలి.. నన్నీ బడ్డీ మూసి ఆఫీసులోకి రమ్మంటే వస్తాను అని అన్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
ఉదయం పది గంటల సమయంలో సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ ముందు టాక్సీ దిగింది వాసంతి. ఒక కరెన్సీ నోటును డ్రయివర్ కి అందించి, మెయిన్ గేటును క్రాస్ చేయబోతుండగా, పరుగు పరుగున వచ్చి, ఆమెను పలుకరించాడు కాలేషావలీ. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ పనిచేసే బిల్డింగ్ ఎదురుగా, రోడ్డుకు అవతలివైపున ఒక కిళ్ళీ బడ్డీని నడుపుకుంటూ ఉంటాడతను. 'ఈ రోజు నేను బడ్డీని తెరిచిన దగ్గర్నించీ ఇప్పటివరకూ నాలుగు సార్లు మన ఆఫీసు దగ్గరకు వచ్చారు ఇద్దరు వ్యక్తులు. ఎవరో నాకు అర్థం కాలేదు'.. అంటూ తను చూసిన విషయాన్ని రిపోర్ట్ చేశాడతను. అందంగా నవ్వి అలాగేనని అన్నట్టు తల ఊపింది వాసంతి. అప్పటికీ అవతలికి పోలేది కాషావలీ. వాళ్ళు ఎవరోగాని చాల రఫ్ గా కనిపిస్తున్నారమ్మా.. ఎందుకయినా మంచిది మీరు కాస్తంత ఎలర్ట్ గా ఉండాలి.. నన్నీ బడ్డీ మూసి ఆఫీసులోకి రమ్మంటే వస్తాను అని అన్నాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.