ఒక పెద్ద కుదుపు కుదిపి సడన్ గా ఆగిపోయింది శ్యాంసుందర్ డ్రయివ్ చేస్తున్న అంబాసిడర్. అంతకు వారం రోజుల క్రితమే ఖరీదు చేసిన వెహికల్ అది. ఎంత పిచ్చిపిచ్చిగా నడిపినా మరో ఆరు ఏడు నెలల వరకూ ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదని నొక్కి నొక్కి చెప్పాడు ఆ కారును అంటగట్టిన ఆటో మొబైల్ షోరూం ఓనర్.
నోటికి వచ్చిన ఘాటయిన మాటలన్నిటినీ ఉపయోగించి అతన్ని తిట్టిపోద్దామనుకున్నాడు శ్యాంసుందర్. పక్కనే వాసంతి కూర్చుని ఉన్నదనే విషయం గుర్తుకువచ్చి, తన ఇరిటేషన్ ని తనలోనే అదుముకున్నాడు. మోటార్ వెహికల్స్ నే కాదు, మిరియాల పొడుమును కూడా బాగా ఆలోచించి ఖరీదు చేయాలి. రోడ్డుమీద నడుస్తూ నడుస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో.. ఇలాగే ఉంటుంది. అతని మనసుల్ని ఆలోచనల్ని అతి తేలికగా పసికట్టి కూల్ గా తన అభిప్రాయాల్ని వెల్లడించింది వాసంతి. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో సెక్రటరీగా పని చేస్తున్నది ఆమె. ఆ సంస్థకు యజమానులైన ఇద్దరిలో రెండోవాడు శ్యాంసుందర్. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.
ఒక పెద్ద కుదుపు కుదిపి సడన్ గా ఆగిపోయింది శ్యాంసుందర్ డ్రయివ్ చేస్తున్న అంబాసిడర్. అంతకు వారం రోజుల క్రితమే ఖరీదు చేసిన వెహికల్ అది. ఎంత పిచ్చిపిచ్చిగా నడిపినా మరో ఆరు ఏడు నెలల వరకూ ఎటువంటి ఇబ్బందీ ఎదురుకాదని నొక్కి నొక్కి చెప్పాడు ఆ కారును అంటగట్టిన ఆటో మొబైల్ షోరూం ఓనర్. నోటికి వచ్చిన ఘాటయిన మాటలన్నిటినీ ఉపయోగించి అతన్ని తిట్టిపోద్దామనుకున్నాడు శ్యాంసుందర్. పక్కనే వాసంతి కూర్చుని ఉన్నదనే విషయం గుర్తుకువచ్చి, తన ఇరిటేషన్ ని తనలోనే అదుముకున్నాడు. మోటార్ వెహికల్స్ నే కాదు, మిరియాల పొడుమును కూడా బాగా ఆలోచించి ఖరీదు చేయాలి. రోడ్డుమీద నడుస్తూ నడుస్తూ అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఇదిగో.. ఇలాగే ఉంటుంది. అతని మనసుల్ని ఆలోచనల్ని అతి తేలికగా పసికట్టి కూల్ గా తన అభిప్రాయాల్ని వెల్లడించింది వాసంతి. సిటీ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో సెక్రటరీగా పని చేస్తున్నది ఆమె. ఆ సంస్థకు యజమానులైన ఇద్దరిలో రెండోవాడు శ్యాంసుందర్. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.