తన అక్షరాలు
తన అక్షరాలు
అవటానికి
అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ
అదేమిటో వాటి రూపే మారిపోతుంది
తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి
ఒక్కోసారి మరీ ముద్దొచ్చి
కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని
గుప్పెట నిండా పట్టుకుంటానా
చేతి నిండా తేనె చిప్పిలుతుంది
అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను
తెల్లగా ముస్తాబై లేతచీకటి నీలంలో కూచుంటానా
గుప్పెడు యిసకతీసి నా మీదకి కచ్చగా విసిరినట్లు
కాసిన్ని పదాలు తన పెదాల మీంచి కసికసిగా జారి
నా మీద అక్షరాల వెన్నెలతలంబ్రాలు రాలినట్లవుతుంది
ఆ వెన్నెల్లో తడవగానే మనసుకి జలుబుచేస్తుంది
ఎప్పుడన్నా అకారణంగా అడ్డం తిరుగుతానా
అమానుష అన్యాయం మితిమీరి
ప్రాణాలకి తెగించి తిరగబడిన
దగాపడిన ప్రజల కనుగుడ్డుల్లా ఎర్రగా కరిగిన ఇనుం బోట్లలా
తన అక్షరాలు నిప్పురావ్వల్లా
నా మొహానొచ్చి కొట్టుకుంటాయి
అప్పుడు హృదయం కనలి ఏడుపొస్తోంది
తన అక్షరాల పదబంధాలు
తేనెలా మంచులా వెన్నెలలా
అవసరమైతే అగ్నిశూలాల్లా
తన అక్షరాల పదబంధాలు
తనలాగానే
- రేవతిదేవి
సాహిత్యకాశంలో వురుములూ మెరుపులూ అస్తమానురావు. పెద్ద వర్షం కురిసే ముందో వెనుకో అవి వస్తాయి. ఆ వర్షమే హిమజ్వాల. తన తొలి నవలతో అఖండమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించినవారు ఏ భాషలోనైనా అరుదుగానే వుంటారు. కీర్తి వెనకాల పరుగెత్తకుండా శ్రీ వడ్డెర చండీదాస్ తమ తొలి నవలతోనే అగ్రశ్రేణి రచయితల పీఠాన్ని ఆక్రమించారు.
హిమజ్వాల ఆల్ ఆర్ట్ యీజ్ కంట్రావర్షియల్ లాగ ఒక వివాదాస్పదమైన నవల. జీనియస్ కూడా వివాదాస్పదమైనదే. హిమజ్వాల ఒక ఆక్సిడెంట్ తో ప్రారంభమయి ఒక ఆక్సిడెంట్ తోనే ముగుస్తుంది.
సాహిత్యం కూడా ఉత్తేజకరమైన పానీయంలాంటిది. హిమజ్వాల ఎటువంటి కిక్కిస్తుందో పాఠకులు ఎవరికీవారే నిర్ణయించుకోవాలి.
- పురాణం సుబ్రహ్మణ్యశర్మ
తన అక్షరాలు తన అక్షరాలు అవటానికి అవీ ఆ మురికి నిఘంటువులోవే గానీ అదేమిటో వాటి రూపే మారిపోతుంది తన పెదాల మీంచీ చేతుల్లోంచీ జారే సరికి ఒక్కోసారి మరీ ముద్దొచ్చి కాసిన్ని అక్షరాలా గుత్తుల్ని గుప్పెట నిండా పట్టుకుంటానా చేతి నిండా తేనె చిప్పిలుతుంది అప్పుడు నాకు తేలీకుండానే వేళ్ళు నోట్లో పెట్టుకుంటాను తెల్లగా ముస్తాబై లేతచీకటి నీలంలో కూచుంటానా గుప్పెడు యిసకతీసి నా మీదకి కచ్చగా విసిరినట్లు కాసిన్ని పదాలు తన పెదాల మీంచి కసికసిగా జారి నా మీద అక్షరాల వెన్నెలతలంబ్రాలు రాలినట్లవుతుంది ఆ వెన్నెల్లో తడవగానే మనసుకి జలుబుచేస్తుంది ఎప్పుడన్నా అకారణంగా అడ్డం తిరుగుతానా అమానుష అన్యాయం మితిమీరి ప్రాణాలకి తెగించి తిరగబడిన దగాపడిన ప్రజల కనుగుడ్డుల్లా ఎర్రగా కరిగిన ఇనుం బోట్లలా తన అక్షరాలు నిప్పురావ్వల్లా నా మొహానొచ్చి కొట్టుకుంటాయి అప్పుడు హృదయం కనలి ఏడుపొస్తోంది తన అక్షరాల పదబంధాలు తేనెలా మంచులా వెన్నెలలా అవసరమైతే అగ్నిశూలాల్లా తన అక్షరాల పదబంధాలు తనలాగానే - రేవతిదేవి సాహిత్యకాశంలో వురుములూ మెరుపులూ అస్తమానురావు. పెద్ద వర్షం కురిసే ముందో వెనుకో అవి వస్తాయి. ఆ వర్షమే హిమజ్వాల. తన తొలి నవలతో అఖండమైన పేరు ప్రఖ్యాతలు ఆర్జించినవారు ఏ భాషలోనైనా అరుదుగానే వుంటారు. కీర్తి వెనకాల పరుగెత్తకుండా శ్రీ వడ్డెర చండీదాస్ తమ తొలి నవలతోనే అగ్రశ్రేణి రచయితల పీఠాన్ని ఆక్రమించారు. హిమజ్వాల ఆల్ ఆర్ట్ యీజ్ కంట్రావర్షియల్ లాగ ఒక వివాదాస్పదమైన నవల. జీనియస్ కూడా వివాదాస్పదమైనదే. హిమజ్వాల ఒక ఆక్సిడెంట్ తో ప్రారంభమయి ఒక ఆక్సిడెంట్ తోనే ముగుస్తుంది. సాహిత్యం కూడా ఉత్తేజకరమైన పానీయంలాంటిది. హిమజ్వాల ఎటువంటి కిక్కిస్తుందో పాఠకులు ఎవరికీవారే నిర్ణయించుకోవాలి. - పురాణం సుబ్రహ్మణ్యశర్మ
© 2017,www.logili.com All Rights Reserved.