'ఉబ్బిన నల్లని రెప్పల క్రింద గాజు గోళీల్లా వ్రేలాడే కళ్ళలో
అనంతమైన చీకటిని దాచుకుని
తన అయిదారెళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకుని
అతడు పెట్టె పెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు"
"తులసి మొక్క చుట్టూ తెరల్లా కమ్ముకునే చీకటి అంచుల్ని
రెపరెప లాడిస్తూ అరటిదొన్నెల్లో నీవు వెలిగించిన కార్తీక దీపాలు
కొండెక్కకుండా నా కంటితడి ముప్పై మూడేళ్ళుగా కాపాడుతూనే ఉంది"
"బయట ముసురు పట్టినప్పుడల్లా
మనసంతా చిక్కుపడ్డ దారపు ఉండలా
చిరాకు చిరాకుగా ఉంటుంది"
"ఆకాశం గుండెల్లోంచి ఆనందం వెన్నెల బిందువుల లా
మేఘాల చెక్కిళ్ళ మీదుగా జాలువారుతుంది"
"పడమర ద్వారంలోంచి వచ్చి తూర్పుకొండల వెనుకకు నడచి వెళ్ళే
ఆమె వెనకే ఆరిపోయే నా కలల దీపాలు"
"ఏటి మీదకు జారిన ఎర్రగన్నేరు పువ్వులాంటి
అందమైన ఆ రోజుల్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవాలని
కాలపు ఒడ్డు మీంచి జ్ఞాపకాల వలలని వృధాగా విసురతాం"
"నాలాగే కొలనులో హృదయాన్ని పారేసుకున్న నీలాకాశం"
"అందుకోలేని స్వప్నాల సరిహద్దులను తాకే ఊహారేఖ జీవితం"
"నాయనమ్మ, నీవు కాలం గడిస్తే మరిచిపోయే జ్ఞాపకానివి కావు
నా జీవితంలో తేనెలు చిందించిన బంగారు బాల్యానివి"
'ఉబ్బిన నల్లని రెప్పల క్రింద గాజు గోళీల్లా వ్రేలాడే కళ్ళలో అనంతమైన చీకటిని దాచుకుని తన అయిదారెళ్ళ మనుమరాలినే ఊతకర్రగా చేసుకుని అతడు పెట్టె పెట్టెలో చిట్లిన పాటలా ప్రవహిస్తాడు" "తులసి మొక్క చుట్టూ తెరల్లా కమ్ముకునే చీకటి అంచుల్ని రెపరెప లాడిస్తూ అరటిదొన్నెల్లో నీవు వెలిగించిన కార్తీక దీపాలు కొండెక్కకుండా నా కంటితడి ముప్పై మూడేళ్ళుగా కాపాడుతూనే ఉంది" "బయట ముసురు పట్టినప్పుడల్లా మనసంతా చిక్కుపడ్డ దారపు ఉండలా చిరాకు చిరాకుగా ఉంటుంది" "ఆకాశం గుండెల్లోంచి ఆనందం వెన్నెల బిందువుల లా మేఘాల చెక్కిళ్ళ మీదుగా జాలువారుతుంది" "పడమర ద్వారంలోంచి వచ్చి తూర్పుకొండల వెనుకకు నడచి వెళ్ళే ఆమె వెనకే ఆరిపోయే నా కలల దీపాలు" "ఏటి మీదకు జారిన ఎర్రగన్నేరు పువ్వులాంటి అందమైన ఆ రోజుల్ని మళ్ళీ ఒడిసి పట్టుకోవాలని కాలపు ఒడ్డు మీంచి జ్ఞాపకాల వలలని వృధాగా విసురతాం" "నాలాగే కొలనులో హృదయాన్ని పారేసుకున్న నీలాకాశం" "అందుకోలేని స్వప్నాల సరిహద్దులను తాకే ఊహారేఖ జీవితం" "నాయనమ్మ, నీవు కాలం గడిస్తే మరిచిపోయే జ్ఞాపకానివి కావు నా జీవితంలో తేనెలు చిందించిన బంగారు బాల్యానివి"
© 2017,www.logili.com All Rights Reserved.