బాల్య వివాహములును, వృద్ధ వివాహములును సనాతనధర్మ సదాచారములయిన హిందూ సంఘమునందు
వివాహతత్త్వార్థమే దుర్బోధ్యమయి వివాహము నిందాపాత్రమైనది. బాల్య వివాహములను నిర్మూలముచేయుటకు
హరవిలాస శారదాగారు కంకణమును గట్టుకొనిరి. లక్షలమంది స్త్రీలు, పురుషులు శారదగారి ప్రయత్నములను
కొనియాడి సఫలము చేయుటకు దీక్షను బూనిరి. పూర్వాచార పరాయణులు శారదాబిల్లును ఖండించి నిరసించిరి.
కాని ప్రజా సామాన్యమునకు వివాహధర్మమును సువ్యక్తము చేయుట పండితులకు ధర్మమైయున్నది.