కనిపించిన మేరంతా పచ్చదనం కొబ్బరి చెట్లు వరిచేలు వశిష్ట
గౌతమీ గోదావరుల మధ్య కడియువు లంక
పులా సొగసులతో పరిమళాలతో అలరారుతూ ఉంటుంది.
చాల సారవంతమైన భూమి కావడాన అన్ని రకాల
మొక్కలూ అలవోకగా పెరుగుతాయి.
మామిడి పనస సపోటా మొదలైన పళ్ళతోటలు
కనువిందు చేస్తాయి. కోనసీమలో ప్రధాన పంట వరి
అందుకే ఈ ప్రాంతాన్ని
'రైస్ బౌల్ అఫ్ ఆంధ్రా' అంటారు.
- సుందరి వేదుల
సస్యశ్యామలంగా సుభిక్షంగా కంటికింపైన
ఆకుపచ్చని అందాలతో కనువిందుగా ఉండే డెల్టా
పరివాహక ప్రాంతం కోనసీమ.
త్రిభుజాకారంలో ఓ కొనకి అంటే మూలకి ఉంది కానక
మొదట కోనసీమ అనే పేరుంపొంది ఆపైన
కాలక్రమంలో కోనసీమగా రూపాంతరం చెందిన
ఈ అందమైన ప్రదేశం.
కోనసీమ అందాలు చూడడానికి రెండు కళ్ళు సరిపోవు.
కనిపించిన మేరంతా పచ్చదనం కొబ్బరి చెట్లు వరిచేలు వశిష్ట
గౌతమీ గోదావరుల మధ్య కడియువు లంక
పులా సొగసులతో పరిమళాలతో అలరారుతూ ఉంటుంది.
చాల సారవంతమైన భూమి కావడాన అన్ని రకాల
మొక్కలూ అలవోకగా పెరుగుతాయి.
మామిడి పనస సపోటా మొదలైన పళ్ళతోటలు
కనువిందు చేస్తాయి. కోనసీమలో ప్రధాన పంట వరి
అందుకే ఈ ప్రాంతాన్ని
'రైస్ బౌల్ అఫ్ ఆంధ్రా' అంటారు.
- సుందరి వేదుల