శ్వాసరూపంలో మనలో సంచరించే మహాదేవుడు భుజించినంత కాలము శరీరానికి సత్తువనిస్తాడు. అందుకే శ్వాస ఉన్నంతకాలం ఈ దేహం 'శివం'... ఆ శ్వాస ఆగిన మరుక్షణం 'శవం', మరి మనలోని మహాశివుడికి నైవేద్యం ఎలా ఉండాలి? 'శుచిగా' ఉండాలి. 'రుచి'గా ఉండాలి. చూడగానే నోరూరించాలి.. కంటికి 'ఇంపు'గా ఉండాలి. ఆ ఘుమఘుమలకి 'నాసిక' పరవశించాలి. 'ఆహా' 'ఓహో' అన్న మెప్పుదలలు చెవులకి వినిపించాలి. 'నాలుక' రుచితో నర్తించాలి. శరీరం ఓ మత్తుతో పవళించాలి. అంటే పంచేంద్రియాలు ఆనందంలో మునిగిపోవాలన్నమాట!
అలా ఎప్పుడు సాధ్యమౌతుందీ? చక్కగా 'నేర్చుకుని' వంట వండినప్పుడు. నేర్పెదేవరూ? తరతరాలుగా 'మన' ప్రాంతపు వంటలని మన పెద్దలు నేర్పుతూనే వున్నా చాలా చక్కని వంటలని మన దైనందిక కార్యక్రమాలలో పడి మరచిపోయాం. మళ్ళీ మనకి అవన్నీ గుర్తుచేసి, మనకి మనమే పాకశాస్త్రాన్ని నేర్చుకునే విధంగా 'వలబోజ జ్యోతిగారు' అద్భుతమైన వంటలన్నింటినీ వరుసక్రమంలో ఏర్చి కూర్చి మనకి అందించారు. నిజంగా ఆ పుస్తకం అమూల్యమైనది. వీరిచ్చిన 'కొలతల' ననుసరించి 'వొండి' చూడండి. స్వర్గం మీ నాలుక అంచున లేకపోతే నామీదొట్టు!
శ్వాసరూపంలో మనలో సంచరించే మహాదేవుడు భుజించినంత కాలము శరీరానికి సత్తువనిస్తాడు. అందుకే శ్వాస ఉన్నంతకాలం ఈ దేహం 'శివం'... ఆ శ్వాస ఆగిన మరుక్షణం 'శవం', మరి మనలోని మహాశివుడికి నైవేద్యం ఎలా ఉండాలి? 'శుచిగా' ఉండాలి. 'రుచి'గా ఉండాలి. చూడగానే నోరూరించాలి.. కంటికి 'ఇంపు'గా ఉండాలి. ఆ ఘుమఘుమలకి 'నాసిక' పరవశించాలి. 'ఆహా' 'ఓహో' అన్న మెప్పుదలలు చెవులకి వినిపించాలి. 'నాలుక' రుచితో నర్తించాలి. శరీరం ఓ మత్తుతో పవళించాలి. అంటే పంచేంద్రియాలు ఆనందంలో మునిగిపోవాలన్నమాట! అలా ఎప్పుడు సాధ్యమౌతుందీ? చక్కగా 'నేర్చుకుని' వంట వండినప్పుడు. నేర్పెదేవరూ? తరతరాలుగా 'మన' ప్రాంతపు వంటలని మన పెద్దలు నేర్పుతూనే వున్నా చాలా చక్కని వంటలని మన దైనందిక కార్యక్రమాలలో పడి మరచిపోయాం. మళ్ళీ మనకి అవన్నీ గుర్తుచేసి, మనకి మనమే పాకశాస్త్రాన్ని నేర్చుకునే విధంగా 'వలబోజ జ్యోతిగారు' అద్భుతమైన వంటలన్నింటినీ వరుసక్రమంలో ఏర్చి కూర్చి మనకి అందించారు. నిజంగా ఆ పుస్తకం అమూల్యమైనది. వీరిచ్చిన 'కొలతల' ననుసరించి 'వొండి' చూడండి. స్వర్గం మీ నాలుక అంచున లేకపోతే నామీదొట్టు!© 2017,www.logili.com All Rights Reserved.