అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీ శంకర్ వచనంలో మనకు కనిపిస్తుంది. కవిత్వ శైలి జోడించడం వలన జూలూరు వచనం పొక్కిలైన వాకిట సానుపు చల్లినట్టు వుంటుంది. నిండిన చెరువు అలుగు పారినట్టు ఉంటుంది మత్తడి దూకుతున్నట్టు ఉంటుంది. వోడ్డుల్ని కూల్చుకుంటూ పోయే నదీ ప్రవాహంలా సాగుతుందీ వచనం. ఉద్యమా వేశంతో వేసే ఒక పోరుకేక ఒక యుద్దాక్రందన జూలూరి వచనం. అందుకే ఒక జలపాతపు హోరుని, ఒక సాగర ఘోషని అతని వచనంలో వినగలం. తెలంగాణ నేల తరతరాల దాస్యశృంఖలాలను తెంచుకుంటున్న సవ్వడిని ఈ వ్యాసాలకు నేపధ్య సంగీతంలా కూర్చాడు గౌరీ శంకర్.
-ఎ.కె.ప్రభాకర్.
అక్షరాల్ని ఎక్కుపెట్టిన అస్త్రాలుగా, పదాల్ని పదును తీర్చిన శస్త్రాలుగా, వాక్యాల్ని లక్ష్యం వైపు దూసుకుపోయే వార్ హెడ్స్ గా మలచిన విశిష్టమైన విద్య వొకటి గౌరీ శంకర్ వచనంలో మనకు కనిపిస్తుంది. కవిత్వ శైలి జోడించడం వలన జూలూరు వచనం పొక్కిలైన వాకిట సానుపు చల్లినట్టు వుంటుంది. నిండిన చెరువు అలుగు పారినట్టు ఉంటుంది మత్తడి దూకుతున్నట్టు ఉంటుంది. వోడ్డుల్ని కూల్చుకుంటూ పోయే నదీ ప్రవాహంలా సాగుతుందీ వచనం. ఉద్యమా వేశంతో వేసే ఒక పోరుకేక ఒక యుద్దాక్రందన జూలూరి వచనం. అందుకే ఒక జలపాతపు హోరుని, ఒక సాగర ఘోషని అతని వచనంలో వినగలం. తెలంగాణ నేల తరతరాల దాస్యశృంఖలాలను తెంచుకుంటున్న సవ్వడిని ఈ వ్యాసాలకు నేపధ్య సంగీతంలా కూర్చాడు గౌరీ శంకర్. -ఎ.కె.ప్రభాకర్.© 2017,www.logili.com All Rights Reserved.