ఆరేళ్ళ కిందట విడుదలైన 'దళితపక్షం' కొనసాగింపు ఇప్పటి 'కొత్తకోణం.' ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన వ్యాసాల సంకలనం తర్వాత వచ్చిన ఈ పుస్తకం సాక్షిలో ప్రచురిస్తున్న రచనల సమాహారం. అంబేడ్కర్ ఆలోచనా విధానంలో వీక్షించి తాజా పరిణామాలను తాత్విక దృష్టిలో అన్వయించడం, విశ్లేషించడం ప్రతి రచనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారం వారం విధిగా వ్యాసం రాసి పాఠకులను ఒప్పించడం, మెప్పించడం ఆషామాషీ కాదు. వస్తువును ఎన్నుకోవాలి. విషయ సేకరణ చేయాలి. అధ్యయనం తప్పనిసరి. అన్ని కోణాలను స్పృశించాలి. అన్ని వాదనలను సమీక్షించి రచయిత తన ప్రతిపాదన వినిపించాలి. అన్ని పార్శ్వాలను పరిశీలించడం, అన్ని వర్గాలను కలుపుకొని పురోగమించే దృక్పథాన్ని బాల్యంలోనే అలవరచుకున్న ఆచరణశీలి అనుభవజ్ఞుడైన పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య.
జనహితం ఆకాంక్షించే మేధావి. అంబేడ్కర్ మానసపుత్రుడు. మూడేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రావడానికి కారణమైన ఉద్యమం ఈ సామరస్య విధానం వల్లనే లక్ష్మయ్య సారధ్యంలో విజయం సాధించింది. టీజాక్ సహాధ్యక్షుడుగా లక్ష్మయ్య ఉద్యమవ్యూహం రచించడంలోనూ ఈ మనస్తత్వం దోహదం చేసింది. భారత రాజ్యంగ సభలో జరిగిన చర్చాపచర్చలలోని విశేషాలూ, అంబేడ్కర్ ఉపన్యాసాల నుంచీ, రచనల నుంచీ ఉటంకించదగిన అంశాలూ, ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విప్లవాలూ, సామాజిక ఉద్యమాలూ చెబుతున్న పాఠాలూ ఈ పుస్తకంలోని ప్రతి అక్షరంలోను కనిపిస్తాయి. వర్తమాన పరిణామాలను చారిత్రిక, సామాజిక, రాజకీయార్థిక దృష్టికోణంలో పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రేరేపించే కరదీపిక ఈ పుస్తకం.
- కొండుభట్ల రామచంద్రమూర్తి
ఆరేళ్ళ కిందట విడుదలైన 'దళితపక్షం' కొనసాగింపు ఇప్పటి 'కొత్తకోణం.' ఆంధ్రజ్యోతి లో ప్రచురించిన వ్యాసాల సంకలనం తర్వాత వచ్చిన ఈ పుస్తకం సాక్షిలో ప్రచురిస్తున్న రచనల సమాహారం. అంబేడ్కర్ ఆలోచనా విధానంలో వీక్షించి తాజా పరిణామాలను తాత్విక దృష్టిలో అన్వయించడం, విశ్లేషించడం ప్రతి రచనలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. వారం వారం విధిగా వ్యాసం రాసి పాఠకులను ఒప్పించడం, మెప్పించడం ఆషామాషీ కాదు. వస్తువును ఎన్నుకోవాలి. విషయ సేకరణ చేయాలి. అధ్యయనం తప్పనిసరి. అన్ని కోణాలను స్పృశించాలి. అన్ని వాదనలను సమీక్షించి రచయిత తన ప్రతిపాదన వినిపించాలి. అన్ని పార్శ్వాలను పరిశీలించడం, అన్ని వర్గాలను కలుపుకొని పురోగమించే దృక్పథాన్ని బాల్యంలోనే అలవరచుకున్న ఆచరణశీలి అనుభవజ్ఞుడైన పత్రికా రచయిత, సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య. జనహితం ఆకాంక్షించే మేధావి. అంబేడ్కర్ మానసపుత్రుడు. మూడేళ్ళ క్రితం అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రావడానికి కారణమైన ఉద్యమం ఈ సామరస్య విధానం వల్లనే లక్ష్మయ్య సారధ్యంలో విజయం సాధించింది. టీజాక్ సహాధ్యక్షుడుగా లక్ష్మయ్య ఉద్యమవ్యూహం రచించడంలోనూ ఈ మనస్తత్వం దోహదం చేసింది. భారత రాజ్యంగ సభలో జరిగిన చర్చాపచర్చలలోని విశేషాలూ, అంబేడ్కర్ ఉపన్యాసాల నుంచీ, రచనల నుంచీ ఉటంకించదగిన అంశాలూ, ప్రపంచవ్యాప్తంగా సంభవించిన విప్లవాలూ, సామాజిక ఉద్యమాలూ చెబుతున్న పాఠాలూ ఈ పుస్తకంలోని ప్రతి అక్షరంలోను కనిపిస్తాయి. వర్తమాన పరిణామాలను చారిత్రిక, సామాజిక, రాజకీయార్థిక దృష్టికోణంలో పరిశీలించి అర్థం చేసుకోవడానికి ప్రేరేపించే కరదీపిక ఈ పుస్తకం. - కొండుభట్ల రామచంద్రమూర్తి© 2017,www.logili.com All Rights Reserved.