PREAMBLE (ముందుమాట)
ఒక మామూలు మనిషి అవసరానికి అర్ధణా కూడా లేకుండా అవస్థలు పడి ఆతరువాత ఆ వ్యక్తి 'స్వయం కృషితో మనం తలెత్తి చూసినా కనపడనంత ఎత్తుకు ఎదిగి తన మేథస్సుతో కేవలం తన మేథస్సుతో అంతులేని కీర్తి ప్రతిష్టలు, అవసరంలో ఉన్న వాళ్లని ఆదుకోవడానికి అంతులేని ధనం సంపాదించి సామాజిక స్పృహతో జీవించే వ్యక్తి జీవితం చరిత్ర కాక మరేమవుతుంది.
"మన కళ్ల ముందు పుట్టినోడు ఇంత గొప్పోడెలా అయ్యాడా!" అని తెలిసిన వాళ్ల మైండ్లో తొలిచే ప్రశ్న తెలియని వాళ్లకు తెలుసుకోవాలనే ఆతృత వాటన్నిటికీ సమాధానం కావాలంటే ఆ గొప్ప వ్యక్తి జీవితం మనముందు పుస్తకరూపంలో ఆవిష్కరింపబడాలి... ఆ పుస్తకం చదివిన ఎంతోమందికి ప్రేరణ కావాలి.
ఒక తులం బంగారం దొరకాలంటే కొన్ని టన్నుల మట్టిని తవ్వాల్సివస్తుంది.
కాని ప్రపంచ చరిత్రని, గొప్పవాళ్ల గురించి తెలుసుకోవాలంటే ఒక చిన్న పుస్తకంలో చూడవచ్చు. ఈ గొప్పవాళ్ల దగ్గరికి మనం చేరలేం. కానీ వీళ్ల గురించి రాసిన పుస్తకాలని మన చేతిలో ఉంచుకొని, గొప్పతనాన్ని మన హృదయలోతుల్లోకి తెచ్చుకోగలం.
పుస్తకం అంత విలువైంది. రామాయణాన్ని వాల్మీకీ, భారతాన్ని వ్యాసుడు గ్రంధస్థం చేయక పోయుంటే మనకి పురాణాలు, చరిత్ర అవగాహనయ్యేనా! అందుకే ఈ జీవిత చరిత్ర
జీవిత చరిత్ర రాయడం రెండు విధాలు....
AUTO BIOGRAPHY:- ఆర్ట్ ఫిలింలాగా యదార్ధంగా ఉంటుంది. ఇన్ఫర్మేషన్ ఇస్తుంది.
BIOGRAPHY:- ఆర్టిస్టిక్గా హృదయాన్ని స్పందింప చేసేలా ఉంటుంది.............
© 2017,www.logili.com All Rights Reserved.