పథేర్ పాంచాలి సినిమా స్క్రిప్టుకు తెలుగు రూపం ఈ పుస్తకం.
భారతీయ చలనచిత్ర రంగాన్ని కుదుపు కుదిపి, కొత్తమలుపు తిప్పిన, 'పథేర్ పాంచాలి' స్క్రీన్ ప్లే ఇప్పుడు తెలుగులో మొదటి సారిగా వెలుగుచూస్తోంది. ఇ౦దులో మనకు మానవ సంబంధాలు కనిపిస్తాయి. హరిహర్ రే కుటుంబ సభ్యుల మధ్య, వారికీ సమాజంలో ఇతర వ్యక్తులకూ మధ్యగల సంబంధ భాంధవ్యాల స్వరూపం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది.
జీవితమే ఇందులోని హీరో... జీవితమే ఇందులోని హీరోయిన్... జీవితమే విలన్, జీవితమే కమీడియన్! హరిహర్ రే ఇంటికి రెండే రెండు పోరుగిళ్ళు ఉంటాయి. ఒకరు ముఖర్జీ కుటుంబం, రెండు నీలమణి కుటుంబం. ముఖర్జీలది సిరిసంపదలు గల కుటుంబం. వీరు హరిహర్ రే కు రక్తసంబంధీకులు! సినిమాలో కనిపించే ముఖర్జీ కుటుంబ సభ్యులుగా సెజ్ బో, రానూ, టును పాత్రలు పోషించారు.
చారిత్రకంగా 'పథేర్ పాంచాలి' సినిమాతో 1910 - 20 నాటి గ్రామీణ పరిస్థితులు చిత్రితమయ్యాయి. బెంగాల్ లోని ఒక మారుమూల గ్రామం నిశ్చిందిపూర్. తరతరాలుగా ఆ ఊళ్ళో ప్రజలు తమ ప్రపంచంలో తాము బతుకుతూ ఉంటారు. దేశంలో వస్తున్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు వారికీ అంతగా తెలియవు. వీటినే చిత్రంగా మలిచి మన ముందుంచారు సత్యజిత్ రే. సినిమాలో వేరు వేరు సన్నివేశాలలో అనేకమంది గ్రామస్తులు కనిపిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో 'పథేర్ పాంచాలి' విజయఢంకా మోగించిన తర్వాత, భారతీయ ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా వచ్చింది. చదివి, ఆనందించండి. ఈ పుస్తకం చదువుతుంటే సినిమా వీక్షించిన అనుభూతి మీలో కలుగుతుంది.
- దేవరాజు మహారాజు
పథేర్ పాంచాలి సినిమా స్క్రిప్టుకు తెలుగు రూపం ఈ పుస్తకం. భారతీయ చలనచిత్ర రంగాన్ని కుదుపు కుదిపి, కొత్తమలుపు తిప్పిన, 'పథేర్ పాంచాలి' స్క్రీన్ ప్లే ఇప్పుడు తెలుగులో మొదటి సారిగా వెలుగుచూస్తోంది. ఇ౦దులో మనకు మానవ సంబంధాలు కనిపిస్తాయి. హరిహర్ రే కుటుంబ సభ్యుల మధ్య, వారికీ సమాజంలో ఇతర వ్యక్తులకూ మధ్యగల సంబంధ భాంధవ్యాల స్వరూపం ఇందులో ప్రధానంగా కనిపిస్తుంది. జీవితమే ఇందులోని హీరో... జీవితమే ఇందులోని హీరోయిన్... జీవితమే విలన్, జీవితమే కమీడియన్! హరిహర్ రే ఇంటికి రెండే రెండు పోరుగిళ్ళు ఉంటాయి. ఒకరు ముఖర్జీ కుటుంబం, రెండు నీలమణి కుటుంబం. ముఖర్జీలది సిరిసంపదలు గల కుటుంబం. వీరు హరిహర్ రే కు రక్తసంబంధీకులు! సినిమాలో కనిపించే ముఖర్జీ కుటుంబ సభ్యులుగా సెజ్ బో, రానూ, టును పాత్రలు పోషించారు. చారిత్రకంగా 'పథేర్ పాంచాలి' సినిమాతో 1910 - 20 నాటి గ్రామీణ పరిస్థితులు చిత్రితమయ్యాయి. బెంగాల్ లోని ఒక మారుమూల గ్రామం నిశ్చిందిపూర్. తరతరాలుగా ఆ ఊళ్ళో ప్రజలు తమ ప్రపంచంలో తాము బతుకుతూ ఉంటారు. దేశంలో వస్తున్న సామాజిక, ఆర్థిక, సాంకేతిక మార్పులు వారికీ అంతగా తెలియవు. వీటినే చిత్రంగా మలిచి మన ముందుంచారు సత్యజిత్ రే. సినిమాలో వేరు వేరు సన్నివేశాలలో అనేకమంది గ్రామస్తులు కనిపిస్తుంటారు. పాశ్చాత్య దేశాల్లో 'పథేర్ పాంచాలి' విజయఢంకా మోగించిన తర్వాత, భారతీయ ప్రేక్షకుల ముందుకు ఆలస్యంగా వచ్చింది. చదివి, ఆనందించండి. ఈ పుస్తకం చదువుతుంటే సినిమా వీక్షించిన అనుభూతి మీలో కలుగుతుంది. - దేవరాజు మహారాజు© 2017,www.logili.com All Rights Reserved.