సాగరమథనం లాగా అంతర్మథనం. సాగర మథనములో కంటికి కనిపించేవి అనేకము వచ్చినవట. అంతర్మథనములో ఇతరులకు కనిపించని తనకు మాత్రమే తెలిసి యుండి, అందులో జ్ఞాపకమున్నవాటికి అక్షర రూపమిచ్చే ప్రయత్నమే ఈ అంతర్మథనం. నిజానికి అంతర్మథనమనేపేరు సందర్భోచితముగా, సమయోచితముగా ఉన్నది.
శ్రీరావినూతల శ్రీరములు, నాయనగారు అనేక సందర్భములలో ఎందరెందరినో గురించి ఎన్నో విషయములు చెప్పేవారు. అతి చిన్న విషయమును కూడా సునిశితముగా పరిశీలించే నేర్పు వారికి స్వంతము. ఎందరెందరిలో దేశభక్తులు, దేశనాయకులు, పారమార్థికులు, కవులు, పండితులు, రైతులు, కూలీలు, గాయకులు, న్యాయవాదులు, అన్ని వర్ణములు, వర్గములవారు ఇంకెందరెందరో ఉన్నారు. దాదాపు 80 సంవత్సరముల జీవితములో తనకెదురై, అనుభవించిన సంఘటనలను, వ్యక్తులను, సన్నివేశములను, ప్రదేశములను, విషయములను వివరముగా గుర్తుపెట్టుకొనుట నాయనగారికి ఉన్న గొప్ప ప్రజ్ఞ. ఇంకా వివరముగా వ్రాస్తే, ఇంకెంత గ్రంథమౌతుందోననే భావనతో క్లుప్తముగా వ్రాసిన అంతర్మథనమిది.
- శ్యాంచరణ్ బాబా
సాగరమథనం లాగా అంతర్మథనం. సాగర మథనములో కంటికి కనిపించేవి అనేకము వచ్చినవట. అంతర్మథనములో ఇతరులకు కనిపించని తనకు మాత్రమే తెలిసి యుండి, అందులో జ్ఞాపకమున్నవాటికి అక్షర రూపమిచ్చే ప్రయత్నమే ఈ అంతర్మథనం. నిజానికి అంతర్మథనమనేపేరు సందర్భోచితముగా, సమయోచితముగా ఉన్నది. శ్రీరావినూతల శ్రీరములు, నాయనగారు అనేక సందర్భములలో ఎందరెందరినో గురించి ఎన్నో విషయములు చెప్పేవారు. అతి చిన్న విషయమును కూడా సునిశితముగా పరిశీలించే నేర్పు వారికి స్వంతము. ఎందరెందరిలో దేశభక్తులు, దేశనాయకులు, పారమార్థికులు, కవులు, పండితులు, రైతులు, కూలీలు, గాయకులు, న్యాయవాదులు, అన్ని వర్ణములు, వర్గములవారు ఇంకెందరెందరో ఉన్నారు. దాదాపు 80 సంవత్సరముల జీవితములో తనకెదురై, అనుభవించిన సంఘటనలను, వ్యక్తులను, సన్నివేశములను, ప్రదేశములను, విషయములను వివరముగా గుర్తుపెట్టుకొనుట నాయనగారికి ఉన్న గొప్ప ప్రజ్ఞ. ఇంకా వివరముగా వ్రాస్తే, ఇంకెంత గ్రంథమౌతుందోననే భావనతో క్లుప్తముగా వ్రాసిన అంతర్మథనమిది. - శ్యాంచరణ్ బాబా© 2017,www.logili.com All Rights Reserved.