దాదాపు పధ్నాలుగు సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాన్ని పునర్ ముద్రించాల్సిన అవసరం ఏర్పడింది. యురేనియం అనే భూతం ఇప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అతలాకుతలం చేస్తోంది. యురేనియం ఖనిజ నిక్షేపాల అన్వేషణ పేరుతో విధ్వంసం గత అయిదారేళ్ల నుంచి నల్లమల అమ్రాబాద్ అటవీ ప్రాంతంలో మొదలయింది. ప్రమాదాన్ని పసికట్టిన ప్రజలు తమ శాయశక్తులా అడ్డుకున్నారు. ఇప్పుడు సాక్షాత్తు కేంద్ర అటవీ , పర్యావరణ శాఖ అనుమతులతో అన్వేషణకు రంగం సిద్దమయింది. హెలికాఫ్టర్లు, డ్రోన్ల సహాయంతో నల్లమల అడవిని జిల్లేడ పట్టటానికి సర్వప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజల తీవ్ర వ్యతిరేకతతో ముగిసిపోయిందనుకున్న నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ దగ్గరలోని పెద్దగుట్ట - లంబాపూర్ లలో తవ్వకాలకు మళ్లీ ప్రయత్నాలు ముదలయినట్టు తెలుస్తోంది. తరువాతది ఈ పుస్తకం చదివి తెలుసుకోండి.