మనిషి ఆహారాన్ని సమకూర్చుకుని ఆకలి తీర్చుకున్న తరువాత తను నివాసం వుండే ఇంటి వాతావరణం తనకు సుఖప్రదంగా వుండాలని కోరుకోవడం సహజం. ఈ కోరిక తీరే క్రమం నుంచి ఉద్భవించిన అనుభవమే 'వాస్తు' గా రూపాంతరం చెందింది. ఇబ్బందులు తొలగి సుఖజీవనం చేసేవారి నివాస ప్రాంత పరిసరాలు అధ్యయనం చేసి, దక్షిణ, పడమర ప్రాంతాలు మెరక, ఉత్తర, తూర్పు ప్రాంతాలు పల్లం అనే మౌలిక సూత్రాలతో ఎందరో దార్శనికులు వేల సంవత్సరాలకు పూర్వమే సమాజ సంక్షేమం కోసం వాస్తు శాస్త్ర నిర్దేశం చేసియున్నారు. ఈ క్రమంలో కొందరు వాస్తు పండితులు మనిషి కన్నా ఇంటి ఆయుర్దాయం పెద్దది గనుక, కాలానుగుణంగా ఇళ్ళు వారసుల ఆధీనంలోకి మారుతుంటాయి గనుక వ్యక్తుల పేరును బట్టి నిర్మాణ వాస్తు లేవదీశారు. ఈ వాదం వల్ల కుల, మత, ప్రాంతాలకు అతీతమైన లక్షణం వాస్తుకు అబ్బిందని చెప్పవచ్చు.
- తూమాటి బ్రహ్మయ్య