ఇంగ్లీషులో రాజకీయాలు మాట్లాడే "సద్గురువులు", గాయత్రీ మంత్రం పై వైద్య పరిశోధనలు, విశ్వవిద్యాలయాల్లో జోతిష్యం, భూత వైద్య అధ్యయనాలు, ఆవు పై వివాదాలు ఇప్పుడెంత మాత్రం హాస్యాస్పదమమైనవి కావు. ఆధునిక చింతన మీద, సమాజ ప్రగతి మీద బ్రాహ్మణిజం చాలా పై చేయి సాధించిందని చెప్పడానికి తార్కాణాలు. ఈ నేల ప్రాచీన చరిత్ర , సైన్స్, ఫిలాసఫీ అంత తనదేనని, తానే జ్ఞానమని , సంస్కృతి అని, నీతి అని బ్రాహ్మణిజం మాట్లాడుతుంది. అది ఎంతగా గతం గురించి మాట్లాడుతుందో అంత వర్తమానంలో జీవిస్తుంది. వేల ఏళ్లుగా బ్రాహ్మణిజం కొనసాగుతూ వస్తున్నదంటేనే అది మార్పు లేకుండా స్థిరంగా ఉన్నట్లు కాదు. బ్రాహ్మణిజం దాని మౌలిక సారాన్ని కాపాడుకుంటూనే కాలానుగుణంగా మారుతూ, పునర్జీవిస్తూ వస్తోంది. అదెలా సాధ్యమైంది? ఒక క్రూరమైన ఆధిపత్య భావజాలం జనసామాన్యం నుండి బ్రహ్మాండమైన నమ్మతిని ఎలా తయారుచేసుకోగలుగుతోంది?