ఈ కథలు మిమ్మల్ని నవ్విస్తాయి. ఏడిపిస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనుషులమధ్య మనుషులకోసం బతకడమే మంచితనం అని నిరూపిస్తాయి. జీవితాన్ని ప్రేమిస్తున్నావా? అయితే కాలాన్ని వృధా చెయ్యకు అని చెప్పి, కాలమే జీవితం అనిపిస్తాయి. చెరుకులో బెల్లం, పాలలో నెయ్యి, పువ్వులో సువాసన దాగినట్టుగా ఈ కథల్లో జాలి, దయ,సానుభూతి దాగి ఉన్నాయి. అందుకున్నవారికి అవి అందుకున్నంతగా లభిస్తాయి.
దాతృత్వం, ధైర్యగుణం, మృదుమధురంగా మాట్లాడటం, మంచి చెడులు తెలిసి ఉండడం.. ఈ నాలుగూ పుట్టుకతో వచ్చే లక్షణాలు. నేర్చుకుంటే రావు. అలాగే కథావస్తువుని ఎన్నిక చేసుకోవడం, తగిన కథనాన్ని అల్లుకోవడం, పాత్రలని కళ్ళకి కట్టడం, పాఠకుణ్ణి రంజింప చెయ్యడం ఈ నాలుగూ కూడా రచయితకి పుట్టుకతోనే వస్తాయి. నేర్చుకుంటే రావు. అలా పుట్టుగొప్ప రచయిత నక్కావిజయరామరాజు అందుకు వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను.
- జగన్నాథశర్మ
ఈ కథలు మిమ్మల్ని నవ్విస్తాయి. ఏడిపిస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనుషులమధ్య మనుషులకోసం బతకడమే మంచితనం అని నిరూపిస్తాయి. జీవితాన్ని ప్రేమిస్తున్నావా? అయితే కాలాన్ని వృధా చెయ్యకు అని చెప్పి, కాలమే జీవితం అనిపిస్తాయి. చెరుకులో బెల్లం, పాలలో నెయ్యి, పువ్వులో సువాసన దాగినట్టుగా ఈ కథల్లో జాలి, దయ,సానుభూతి దాగి ఉన్నాయి. అందుకున్నవారికి అవి అందుకున్నంతగా లభిస్తాయి. దాతృత్వం, ధైర్యగుణం, మృదుమధురంగా మాట్లాడటం, మంచి చెడులు తెలిసి ఉండడం.. ఈ నాలుగూ పుట్టుకతో వచ్చే లక్షణాలు. నేర్చుకుంటే రావు. అలాగే కథావస్తువుని ఎన్నిక చేసుకోవడం, తగిన కథనాన్ని అల్లుకోవడం, పాత్రలని కళ్ళకి కట్టడం, పాఠకుణ్ణి రంజింప చెయ్యడం ఈ నాలుగూ కూడా రచయితకి పుట్టుకతోనే వస్తాయి. నేర్చుకుంటే రావు. అలా పుట్టుగొప్ప రచయిత నక్కావిజయరామరాజు అందుకు వారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. - జగన్నాథశర్మ© 2017,www.logili.com All Rights Reserved.