జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్ లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్ కౌంటర్లు, రాష్ట్ర హోమ్ శాఖమంత్రి హారేన్ పాండ్యా హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్ మేకర్ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్ రాష్ట్రంలో 2001 - 10 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయటంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి.
నరేంద్రమోదీ, అమిత్ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్ నుండి డిల్లీ దాకా వాళ్ళు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. విచారణ కమిషన్ల ఎదుట మాట్లాడవలసి వచ్చినప్పుడు మతిమరుపు నటించిన వారు రహస్యంగా టేపు చేసిన వీడియోల్లో ఏ ఒక్క విషయమూ దాచుకోకుండా చెప్పిన నిజాలను చాలా ఆసక్తిదాయకంగా ఈ పుస్తకం బయట పెడుతుంది.
జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్ లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్ కౌంటర్లు, రాష్ట్ర హోమ్ శాఖమంత్రి హారేన్ పాండ్యా హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్ స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్ మేకర్ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్ రాష్ట్రంలో 2001 - 10 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయటంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి. నరేంద్రమోదీ, అమిత్ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్ నుండి డిల్లీ దాకా వాళ్ళు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. విచారణ కమిషన్ల ఎదుట మాట్లాడవలసి వచ్చినప్పుడు మతిమరుపు నటించిన వారు రహస్యంగా టేపు చేసిన వీడియోల్లో ఏ ఒక్క విషయమూ దాచుకోకుండా చెప్పిన నిజాలను చాలా ఆసక్తిదాయకంగా ఈ పుస్తకం బయట పెడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.