కర్ఫ్యూ అంటేనే కొన్ని ప్రాంతాలను గంపగుత్తగా జైళ్లుగా మార్చేయడం. జైల్లో కనీసం అన్నపానీయాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. ఇక్కడదీ ఉండదు. కర్ఫ్యూ అంటే కడుపు మాడ్చుకోవడమే అనే అర్థం స్థిరపడిపోయిన కుటుంబాలుంటాయి. పిల్లలకు పాలు, మందులు దొరక్క కడుపుకోత అనుభవించే తల్లిదండ్రులుంటారు. కర్ఫ్యూ ఎప్పుడు విధించాలి, ఏఏ ప్రాంతాల్లో విధించాలి, ఏఏ గల్లీల్లో మృదువుగా ఉండాలి. ఏఏ గల్లీల్లో కరుగ్గా ఉండాలి అనేది వాస్తవిక పరిస్థితుల మీద ఆధారపడి ఉందా లేక ముందస్తు అభిప్రాయాల మీదా అనేది కీలకమైన విషయం.
కర్ఫ్యూ మొదలవడానికి ముందే ఫలానా చోట పోలీసుల మీద దాడికి ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు అనే ప్రచారం ఎందుకు మొదలవుతుందో రచయిత శక్తిమంతంగా వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో దాదాపు అన్ని అల్లర్ల సందర్భాల్లోనూ, కాల్పుల్లోనూ ముస్లిం లే ఎక్కువ బాధితులైనప్పటికీ పదే పదే వారినే ఎందుకు బోనులో పెడతారో దాని వెనుక పనిచేసేదేమిటో వివరించారు. వ్యవస్థలో తాము సమానమైన భాగాస్వాములమనీ, తమకు సమానమైన న్యాయం జరుగుతుందనీ నమ్మకం కలుగకపోతే అటువంటి మనుషులు దిక్కుతోచక తమకు తోచిన రూపాల్లో న్యాయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అది ఆవాంఛనీయమైన రూపాలు తీసుకున్నప్పుడు ఖండించడంతో సరిపెట్టుకోకుండా వారికీ వ్యవస్థలో న్యాయం జరిగేలా మనమెంతవరకు ప్రయత్నించాం అనేది సివిల్ సొసైటీ ఆలోచించుకోవాల్సి ఉంది. అలాంటి అంతర్మథనం రేకెత్తించడానికి ఈ చిన్ని పుస్తకం ఉపయోగపడుతుంది.
కర్ఫ్యూ అంటేనే కొన్ని ప్రాంతాలను గంపగుత్తగా జైళ్లుగా మార్చేయడం. జైల్లో కనీసం అన్నపానీయాలను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంటుంది. ఇక్కడదీ ఉండదు. కర్ఫ్యూ అంటే కడుపు మాడ్చుకోవడమే అనే అర్థం స్థిరపడిపోయిన కుటుంబాలుంటాయి. పిల్లలకు పాలు, మందులు దొరక్క కడుపుకోత అనుభవించే తల్లిదండ్రులుంటారు. కర్ఫ్యూ ఎప్పుడు విధించాలి, ఏఏ ప్రాంతాల్లో విధించాలి, ఏఏ గల్లీల్లో మృదువుగా ఉండాలి. ఏఏ గల్లీల్లో కరుగ్గా ఉండాలి అనేది వాస్తవిక పరిస్థితుల మీద ఆధారపడి ఉందా లేక ముందస్తు అభిప్రాయాల మీదా అనేది కీలకమైన విషయం. కర్ఫ్యూ మొదలవడానికి ముందే ఫలానా చోట పోలీసుల మీద దాడికి ముస్లింలు సన్నాహాలు చేస్తున్నారు అనే ప్రచారం ఎందుకు మొదలవుతుందో రచయిత శక్తిమంతంగా వివరించారు. స్వతంత్ర భారత చరిత్రలో దాదాపు అన్ని అల్లర్ల సందర్భాల్లోనూ, కాల్పుల్లోనూ ముస్లిం లే ఎక్కువ బాధితులైనప్పటికీ పదే పదే వారినే ఎందుకు బోనులో పెడతారో దాని వెనుక పనిచేసేదేమిటో వివరించారు. వ్యవస్థలో తాము సమానమైన భాగాస్వాములమనీ, తమకు సమానమైన న్యాయం జరుగుతుందనీ నమ్మకం కలుగకపోతే అటువంటి మనుషులు దిక్కుతోచక తమకు తోచిన రూపాల్లో న్యాయం కోసం ప్రయత్నించే అవకాశం ఉంటుంది. అది ఆవాంఛనీయమైన రూపాలు తీసుకున్నప్పుడు ఖండించడంతో సరిపెట్టుకోకుండా వారికీ వ్యవస్థలో న్యాయం జరిగేలా మనమెంతవరకు ప్రయత్నించాం అనేది సివిల్ సొసైటీ ఆలోచించుకోవాల్సి ఉంది. అలాంటి అంతర్మథనం రేకెత్తించడానికి ఈ చిన్ని పుస్తకం ఉపయోగపడుతుంది.© 2017,www.logili.com All Rights Reserved.