ప్రొఫెసర్ ఇర్వింగ్ ఫంగ్ గౌరవనీయుడైన పాత్రికేయుడు. జర్నలిజం గురించి ఎన్నో పాఠ్య గ్రంథాలను రచించాడు. వార్తా రచనకు చెందిన మూడు మీడియా విభాగాలైన టెలివిజన్, రేడియో, వార్తా పత్రికల మధ్య సారూప్య వ్యత్యాసాలను విశ్లేషించవలసిన ఆవశ్యకతను గుర్తించాడు. మీడియా రంగంలో నిష్ణాతులైన చాలా మందికి రెండు రంగాలలో మాత్రమే ప్రావీణ్యత ఉంది. ఈ మూడు మాధ్యమాలకు కావలసిన వార్తా రచనకి సంబంధించిన అంశాల పట్టిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాక్యాకారంలో 5 భాగాలున్నాయని అరిస్టాటిల్ సూత్రీకరించాడు. అవి ఆవిష్కరణ, క్రమం, శైలి, ధారణ, ప్రాసంగిక సామర్థ్యం. వార్తా రచన పరిశోధకులు మొదటి మూడు విషయాలకు పరిమితమవుతుంటారు. జర్నలిష్టులకు ధారణ, ప్రాసంగిక సామర్థ్యం కూడా అవసరమవుతాయని ఈ గ్రంథం వివరిస్తుంది.
ప్రొఫెసర్ ఇర్వింగ్ ఫంగ్ గౌరవనీయుడైన పాత్రికేయుడు. జర్నలిజం గురించి ఎన్నో పాఠ్య గ్రంథాలను రచించాడు. వార్తా రచనకు చెందిన మూడు మీడియా విభాగాలైన టెలివిజన్, రేడియో, వార్తా పత్రికల మధ్య సారూప్య వ్యత్యాసాలను విశ్లేషించవలసిన ఆవశ్యకతను గుర్తించాడు. మీడియా రంగంలో నిష్ణాతులైన చాలా మందికి రెండు రంగాలలో మాత్రమే ప్రావీణ్యత ఉంది. ఈ మూడు మాధ్యమాలకు కావలసిన వార్తా రచనకి సంబంధించిన అంశాల పట్టిక చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాక్యాకారంలో 5 భాగాలున్నాయని అరిస్టాటిల్ సూత్రీకరించాడు. అవి ఆవిష్కరణ, క్రమం, శైలి, ధారణ, ప్రాసంగిక సామర్థ్యం. వార్తా రచన పరిశోధకులు మొదటి మూడు విషయాలకు పరిమితమవుతుంటారు. జర్నలిష్టులకు ధారణ, ప్రాసంగిక సామర్థ్యం కూడా అవసరమవుతాయని ఈ గ్రంథం వివరిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.