రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. మట్టి మనుషులు, అడవి మనుషులు మహా సంగ్రామంలో అద్భుత శక్తులుగా ఎదిగే చారిత్రిక క్రమాన్ని వ్యక్తిమాత్రం నిదర్శనం రాగో. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కట్టి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించాడు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని - ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు 'సరిహద్దు', 'రాగో' సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.
రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. మట్టి మనుషులు, అడవి మనుషులు మహా సంగ్రామంలో అద్భుత శక్తులుగా ఎదిగే చారిత్రిక క్రమాన్ని వ్యక్తిమాత్రం నిదర్శనం రాగో. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కట్టి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించాడు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని - ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు 'సరిహద్దు', 'రాగో' సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.© 2017,www.logili.com All Rights Reserved.