తెలుగునేల సహా దేశవిదేశాల్లో రామోజీరావు ను మించిన ఘనాపాఠీలు ఎందరో ఉన్నారు. ఆయనను మించి అద్వితీయ ఫలితాలు రాబట్టిన వాణిజ్య, పారిశ్రామికవేత్తలు అనేకమంది అంతటా కనిపిస్తారు. సంపద సృష్టిలోను రామోజీరావు కంటే పది ఆకులు ఎక్కువ చదివిన వారున్నారు. రామోజీ ఊహకే అందని, వేలు పెట్టటానికే సాహసించని ఎన్నోరంగాల్లో, ఎన్నెన్నో వినూత్న ఊహలతో, ఆవిష్కరణలతో, ప్రపంచ దృష్టిని ఆకర్షించి, ఔరా అనిపించుకుంటున్న యువతా మన ముందే "మేలి " కొలుపు పాడుతోంది. ఇలా రామోజీ జీవితంతో ముడిపడిన ప్రతివిషయము, ప్రతిఅలోచనా అందరికి ఆసక్తి గొలిపేదే. అందరు విధిగా తెలుసుకుని తీరవలసిందే . ఆ తెలుసుకునే క్రమంలో తెలియచెప్పటానికి చేసిన చిరుప్రయత్నమే ఇది.