ప్రతి తిరుగుబాటులో భూమి సమస్య ప్రధాన భూమిక వహిస్తూ ఉంటుంది. మూడవ ప్రపంచ దేశాలలో ఈ సమస్య మరీ కీలకమైంది. ఈ దేశాలలో సాగుతున్న ఉద్యమాలు వ్యవసాయ సంబంధమైన ఉద్యమాలు కనుక అక్కడి మేధావులు భూమి సమస్యను శ్రద్ధగా అద్యయనం చేయాలి. భూసంబంధాల్లో, దానితో పాటుగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఈ కీలకమైన సమస్యను ఆయా ఉద్యమాల దశలలో అర్థం చేసుకుంటూ, వాటికనుగుణంగా పరిష్కరించ గలుగుతాం, తెలంగాణ అనగానే గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం అని అందరూ అనుకుంటారు. 20వ శతాబ్దం మొదటి దశ వరకు అది వాస్తవమే. కాని ఈ జిల్లాల్లో గిరిజనులు కొండ ప్రాంతాలకు పరిమితమై మైనారిటీలుగా ఉంటున్నారు. తెలంగాణలో విపరీతమైన మార్పులు జరిగాయి. గిరిజనేతరులు పెద్దఎత్తున చొచ్చుకొని వచ్చి గిరిజనుల భూములను భారీగా ఆక్రమించారు. భూసంబంధాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. తమ భూములు తెలియకుండానే అన్యాక్రాంతం అయినాయి. గిరిజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చడం జరిగింది. ప్రభుత్వాలు వేరు వేరు రూపాలలో దోపిడీ చేయడం జరిగింది. గిరిజనులు తరతరాలుగా అనుభవించిన బాధ తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది.
ప్రతి తిరుగుబాటులో భూమి సమస్య ప్రధాన భూమిక వహిస్తూ ఉంటుంది. మూడవ ప్రపంచ దేశాలలో ఈ సమస్య మరీ కీలకమైంది. ఈ దేశాలలో సాగుతున్న ఉద్యమాలు వ్యవసాయ సంబంధమైన ఉద్యమాలు కనుక అక్కడి మేధావులు భూమి సమస్యను శ్రద్ధగా అద్యయనం చేయాలి. భూసంబంధాల్లో, దానితో పాటుగా మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులను పరిశీలించాలి. అప్పుడు మాత్రమే ఈ కీలకమైన సమస్యను ఆయా ఉద్యమాల దశలలో అర్థం చేసుకుంటూ, వాటికనుగుణంగా పరిష్కరించ గలుగుతాం, తెలంగాణ అనగానే గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతం అని అందరూ అనుకుంటారు. 20వ శతాబ్దం మొదటి దశ వరకు అది వాస్తవమే. కాని ఈ జిల్లాల్లో గిరిజనులు కొండ ప్రాంతాలకు పరిమితమై మైనారిటీలుగా ఉంటున్నారు. తెలంగాణలో విపరీతమైన మార్పులు జరిగాయి. గిరిజనేతరులు పెద్దఎత్తున చొచ్చుకొని వచ్చి గిరిజనుల భూములను భారీగా ఆక్రమించారు. భూసంబంధాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. తమ భూములు తెలియకుండానే అన్యాక్రాంతం అయినాయి. గిరిజనేతరులు గిరిజనులను కూలీలుగా మార్చడం జరిగింది. ప్రభుత్వాలు వేరు వేరు రూపాలలో దోపిడీ చేయడం జరిగింది. గిరిజనులు తరతరాలుగా అనుభవించిన బాధ తిరుగుబాట్ల రూపంలో పెల్లుబికింది.© 2017,www.logili.com All Rights Reserved.