మళ్లీ రామాయణ భారత భాగవతాలా? ఎందుకు? ఉన్నవి చాలవా నాయనా?
నేను రామాయణ భారత భాగవతాలు మళ్లీ రాయలేదు. ఈ పుస్తకం ఈ మహాకావ్యాల్లోని ప్రత్యేక విశేషాలతో కూర్చిన ఒక దండ. అంతే. ఇందులో నా సొంత తాత్పర్యాలు, మార్పు చేర్పులూ, బోధలవంటివేమీ లేవు.
వాల్మీకి సంస్కృత రామాయణం నుంచి, వ్యాస సంస్కృత భారతం నుంచి, తెలుగులో కవిత్రయం చేసిన మహాభారతం నుంచి, వ్యాసుని సంస్కృత భాగవతం నుంచి, అలాగే పోతన రాసిన భాగవతం నుంచి యధాతథంగా శ్లోకాలనుంచి, పద్యాలనుంచి, వచనాలనుంచి కూర్చిన సకల విశేషాల సమాహారం ఈ పుస్తకం. ఇలా చేర్చిన ముచ్చట్ల లో అత్యవసరం అని నేను భావించిన చోట మూల గ్రంథాల్లోని సర్గ, పర్వం, స్కంధం, పద్యం, వచనాల సంఖ్యను బ్రాకెట్ ల లో చేర్చాను.
- తల్లావజ్ఝల శివాజీ