వంశ చరిత్ర
(శ్యామసుందరరావు గారి ఆత్మకథ)
నేను పడాల వీరస్వామిగారి మనువడను, రామస్వామిగారి కుమారుడనైన పడాల శ్యామసుందర్రావును.
అసలు మా పూర్వీకులు రాజమహేంద్రవరమును పాలించిన రాజరాజ నరేంద్రుని కొలువులో వున్న రెడ్డికులస్థులు. ఆ రోజుల్లో వున్న కులతత్త్వాన్ని సహించని పడాల రామిరెడ్డి గారు హరిజనవాడల్లో నివసిస్తూ వాళ్ళను సంఘటిత పరిచి కులతత్త్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆయనే స్వయంగా హరిజన యువతిని పెళ్ళాడి హరిజనుడుగా మారిన మహనీయుడు. మా తాతగారైన వీరస్వామిగారి మొదటి భార్య కుమారుడు రామస్వామి. రామస్వామిగారు పుట్టిన తర్వాత తల్లి మరణించింది. తర్వాత వీరస్వామిగారు ద్వితీయ వివాహం చేసుకొనగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వీరస్వామిగారి రెండవ భార్య కోపిష్టి. ఆమె రామస్వామి గారిని సరిగా చూడకపోవుటచే తండ్రి ఆయనను మట్టపర్రు గ్రామంలోని పెదతల్లి ఇంట విడిచి సంపాదన ధ్యేయంతో పనికొరకు బర్మా (మయన్మార్) వెళ్ళిపోయినారు.
పెద్దమ్మ ఇంట పెరిగిన రామస్వామిగారికి నెలమూరివారి మంగమ్మతో వివాహం జరిగింది. వీరస్వామిగారు బర్మాలోనే ఉండిపోయారు. రామస్వామిగారి స్నేహితుడైన చినమామిడిపల్లి మునసబుగారి తాలూకు (బళ్ళవారు) ప్రోద్బలంతో తండ్రిని ఇండియా తీసుకొచ్చేందుకు ఆయన బర్మా వెళ్ళినారు. రామస్వామిగారు...............
వంశ చరిత్ర (శ్యామసుందరరావు గారి ఆత్మకథ) నేను పడాల వీరస్వామిగారి మనువడను, రామస్వామిగారి కుమారుడనైన పడాల శ్యామసుందర్రావును. అసలు మా పూర్వీకులు రాజమహేంద్రవరమును పాలించిన రాజరాజ నరేంద్రుని కొలువులో వున్న రెడ్డికులస్థులు. ఆ రోజుల్లో వున్న కులతత్త్వాన్ని సహించని పడాల రామిరెడ్డి గారు హరిజనవాడల్లో నివసిస్తూ వాళ్ళను సంఘటిత పరిచి కులతత్త్వానికి వ్యతిరేకంగా పోరాడి ఆయనే స్వయంగా హరిజన యువతిని పెళ్ళాడి హరిజనుడుగా మారిన మహనీయుడు. మా తాతగారైన వీరస్వామిగారి మొదటి భార్య కుమారుడు రామస్వామి. రామస్వామిగారు పుట్టిన తర్వాత తల్లి మరణించింది. తర్వాత వీరస్వామిగారు ద్వితీయ వివాహం చేసుకొనగా ఆమెకు ఇద్దరు కుమార్తెలు పుట్టారు. వీరస్వామిగారి రెండవ భార్య కోపిష్టి. ఆమె రామస్వామి గారిని సరిగా చూడకపోవుటచే తండ్రి ఆయనను మట్టపర్రు గ్రామంలోని పెదతల్లి ఇంట విడిచి సంపాదన ధ్యేయంతో పనికొరకు బర్మా (మయన్మార్) వెళ్ళిపోయినారు. పెద్దమ్మ ఇంట పెరిగిన రామస్వామిగారికి నెలమూరివారి మంగమ్మతో వివాహం జరిగింది. వీరస్వామిగారు బర్మాలోనే ఉండిపోయారు. రామస్వామిగారి స్నేహితుడైన చినమామిడిపల్లి మునసబుగారి తాలూకు (బళ్ళవారు) ప్రోద్బలంతో తండ్రిని ఇండియా తీసుకొచ్చేందుకు ఆయన బర్మా వెళ్ళినారు. రామస్వామిగారు...............© 2017,www.logili.com All Rights Reserved.