నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్ కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రధానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల ఒత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రిక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్ళీమళ్ళీ రాశారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది. హిందూ దేవతలను డోనిగర్ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు నిజమైన బలాలని ఈ గ్రంథం నిరూపిస్తుంది.
- ప్రియంపద గోపాల్ గారు
నాలుగు వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, పురాణాలు, అరణ్యకాలు, శాస్త్రాలతో పాటు రామాయణ మహాభారత ఇతిహాసాల కావ్య సంప్రదాయంతో డోనిగర్ కు క్షుణ్ణమైన పరిజ్ఞానం ఉన్నట్లు ఈ రచన ద్వారా మనకు అర్థమవుతుంది. లిఖిత సంప్రదాయానికి, మౌఖిక సంప్రదాయానికి మధ్య నిరంతర సంబంధాలు, ఆదాన ప్రధానాలు ఉంటాయని వాదించిన ఆమె, హిందూ మతం తన అంతర్గత తిరుగుబాట్లు, ఇతర మతాల ఒత్తిడుల కారణంగా ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నదో తెలియచెప్పారు. రామాయణం అనేక రూపాంతరాలకు గురై, చివరకు దానిని మొట్టమొదట రచించిన వాల్మీకి రామాయణ రూపంతో స్థిరపడింది. మారుతున్న చారిత్రిక పరిస్థితులను స్వీకరిస్తూ దానిని పలువురు మళ్ళీమళ్ళీ రాశారు. మహాభారతం విషయంలోనూ అదే జరిగింది. హిందూ దేవతలను డోనిగర్ 'కల్పనల' స్థాయికి తగ్గించినట్లు అతివాదులు ఆరోపిస్తున్నారు. కాని విభిన్నమైన నిర్వచనాలే హిందూ సంప్రదాయపు నిజమైన బలాలని ఈ గ్రంథం నిరూపిస్తుంది. - ప్రియంపద గోపాల్ గారు© 2017,www.logili.com All Rights Reserved.