Kavyalokanam

By Nangnamuni (Author)
Rs.100
Rs.100

Kavyalokanam
INR
MANIMN4698
In Stock
100.0
Rs.100


In Stock
Ships in 4 - 9 Days
Check for shipping and cod pincode

Description

చేకూరి రామారావు
కొయ్యగుర్రం ఆధునిక మహాకావ్యం

సుమారుగా 1950-60 మధ్యకాలంలో తెలుగుదేశంలో ఆధునిక భావచైతన్యాన్ని ప్రతిబింబించిన ఒకేఒక్క వారపత్రిక 'తెలుగు స్వతంత్ర'. 1954కు పూర్వం మద్రాసు నుంచి, ఆ తరువాత హైదరాబాదు నుంచి వచ్చేది. ఆ పత్రికకు ఒక అలవాటుండేది. వచ్చిన కవితల్లో ఒక పేజీలో సరిపోయే వాటిల్లో మంచిది ఎన్నుకొని విషయసూచిక పక్క పేజీలో అచ్చేసేవారు. ఆ పత్రికలో పడ్డ కవితకి, మరీ ముఖ్యంగా, ఆ పేజీలో పడ్డదానికి తెలుగు పాఠకలోకంలో మంచి గుర్తింపు ఉండేది. నిజాం కాలేజీలో బి.ఏ. చదువుతుండే కొంతమంది మిత్రులం 1956-58 మధ్యకాలం స్వతంత్రలో కవిత్వం చదువుతూ వాటి మంచిచెడ్డల గురించి హాస్టళ్ళలో, వీధుల్లో, పార్కుల్లో, ఇరానీ హోటళ్ళలో టీ తాగుతూ చర్చించుకుంటుండేవాళ్ళం. ఆత్మవిమర్శలు, పరవిమర్శలు, కావ్యవిమర్శల్తో గంటల తరబడి పగళ్ళూ, రాత్రుళ్ళు గడుస్తుండేవి. అలాంటి గంటల్లో ఒకచోట - బహుశా 1957లోనో 1958లోనే అనుకుంటా - ఒక వారం 'స్వతంత్ర'లో విషయసూచిక పక్క పేజీలో అచ్చయిన "సౌందర్యపు స్వగతం" అనే ఖండికను గురించి చర్చించుకుంటున్నాం. కవి పేరు 'సుధ' అని కొటేషన్లో వుంది. ఆ రోజులలోనే నేను 'స్వతంత్ర'లో రాస్తున్న నియోభావగీతాలను అంత మెచ్చుకోని మా 'బక్కోడు' (జె. లక్ష్మీనారాయణ అనే స్నేహితుడు, 'సౌందర్య స్వగతా'నికి ఇంప్రెస్ అయ్యాడు.) 'సుధ' గొంతులో విశిష్టతను గుర్తుపట్టాం......................

చేకూరి రామారావు కొయ్యగుర్రం ఆధునిక మహాకావ్యం సుమారుగా 1950-60 మధ్యకాలంలో తెలుగుదేశంలో ఆధునిక భావచైతన్యాన్ని ప్రతిబింబించిన ఒకేఒక్క వారపత్రిక 'తెలుగు స్వతంత్ర'. 1954కు పూర్వం మద్రాసు నుంచి, ఆ తరువాత హైదరాబాదు నుంచి వచ్చేది. ఆ పత్రికకు ఒక అలవాటుండేది. వచ్చిన కవితల్లో ఒక పేజీలో సరిపోయే వాటిల్లో మంచిది ఎన్నుకొని విషయసూచిక పక్క పేజీలో అచ్చేసేవారు. ఆ పత్రికలో పడ్డ కవితకి, మరీ ముఖ్యంగా, ఆ పేజీలో పడ్డదానికి తెలుగు పాఠకలోకంలో మంచి గుర్తింపు ఉండేది. నిజాం కాలేజీలో బి.ఏ. చదువుతుండే కొంతమంది మిత్రులం 1956-58 మధ్యకాలం స్వతంత్రలో కవిత్వం చదువుతూ వాటి మంచిచెడ్డల గురించి హాస్టళ్ళలో, వీధుల్లో, పార్కుల్లో, ఇరానీ హోటళ్ళలో టీ తాగుతూ చర్చించుకుంటుండేవాళ్ళం. ఆత్మవిమర్శలు, పరవిమర్శలు, కావ్యవిమర్శల్తో గంటల తరబడి పగళ్ళూ, రాత్రుళ్ళు గడుస్తుండేవి. అలాంటి గంటల్లో ఒకచోట - బహుశా 1957లోనో 1958లోనే అనుకుంటా - ఒక వారం 'స్వతంత్ర'లో విషయసూచిక పక్క పేజీలో అచ్చయిన "సౌందర్యపు స్వగతం" అనే ఖండికను గురించి చర్చించుకుంటున్నాం. కవి పేరు 'సుధ' అని కొటేషన్లో వుంది. ఆ రోజులలోనే నేను 'స్వతంత్ర'లో రాస్తున్న నియోభావగీతాలను అంత మెచ్చుకోని మా 'బక్కోడు' (జె. లక్ష్మీనారాయణ అనే స్నేహితుడు, 'సౌందర్య స్వగతా'నికి ఇంప్రెస్ అయ్యాడు.) 'సుధ' గొంతులో విశిష్టతను గుర్తుపట్టాం......................

Features

  • : Kavyalokanam
  • : Nangnamuni
  • : Dwimukha Swamyam Prachuranalu Hyd
  • : MANIMN4698
  • : paparback
  • : 2023 2nd print
  • : 106
  • : Telugu

Reviews

Be the first one to review this product

Discussion:Kavyalokanam

Be the first to start a discussion Start a new discussion

Browse all Discussions on Books
Powered by infibeam