మనదేశంలో కూడా.. పెద్దపెద్ద పట్టణాల్లో టైలర్ షాపులు తక్కువగా ఉంటాయి. ఊర్లు చిన్నవి అవుతున్న కొద్దీ, రడీమేడ్ షాపుల సంఖ్య తగ్గుతుంది. టైలర్ షాపుల సంఖ్య పెరుగుతుంది. అంటే దాని అర్థం, ఇంకా చిన్న చిన్న ఊర్లకి రడీమెడ్ పూర్తిగా విస్తరించలేదని. కాలం గడుస్తున్న కొద్దీ, చిన్న గ్రామాలకి కూడా విస్తరిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకునే క్రమంలో ఇటువంటి మార్పులు అనివార్యం. ఇదంతా చదివిన టైలర్లను, నేను నిరుత్సాహపరుస్తున్నాని అనుకోవద్దు. మన నమ్మకాలతో, మన ఆశలతో, వాస్తవాలకూ, మార్పులకూ సంబంధం ఉండదు. చరిత్ర దాని మానాన అది నడుస్తూనే ఉంటుంది.
అయితే అంత మాత్రానే టైలర్లు భయపడాల్సిందేమీ లేదు. ఇది రూపం మార్పు మాత్రమే. జనం బట్టలు తొడిగినన్నాళ్ళూ మా వృత్తికి వచ్చిన డోకా ఏమీ లేదు. నిజానికి యంత్రాలు కార్మికులకు మేలే చేస్తాయి. కాని ప్రస్తుత వ్యవస్థలో గందరగోళం సృష్టిస్తున్నాయి. అందులో ఉన్న మంచి చెడ్డలు చర్చించడమే ఈ నవలలోని కదా వస్తువు. నాకు తెలిసిన జీవితాన్నీ, కళ్ళ ముందు కనిపిస్తున్న మార్పుల్ని, నా అవగాహన మేరకు చిత్రించాను. తప్పులు రాసినట్లుగా మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. ఈ పుస్తకం మలి ముద్రణకు వస్తే తప్పక సరిజేసుకుంటాను.
- వి వెంకట్రావు
మనదేశంలో కూడా.. పెద్దపెద్ద పట్టణాల్లో టైలర్ షాపులు తక్కువగా ఉంటాయి. ఊర్లు చిన్నవి అవుతున్న కొద్దీ, రడీమేడ్ షాపుల సంఖ్య తగ్గుతుంది. టైలర్ షాపుల సంఖ్య పెరుగుతుంది. అంటే దాని అర్థం, ఇంకా చిన్న చిన్న ఊర్లకి రడీమెడ్ పూర్తిగా విస్తరించలేదని. కాలం గడుస్తున్న కొద్దీ, చిన్న గ్రామాలకి కూడా విస్తరిస్తాయి. పెట్టుబడిదారీ వ్యవస్థ వేళ్ళూనుకునే క్రమంలో ఇటువంటి మార్పులు అనివార్యం. ఇదంతా చదివిన టైలర్లను, నేను నిరుత్సాహపరుస్తున్నాని అనుకోవద్దు. మన నమ్మకాలతో, మన ఆశలతో, వాస్తవాలకూ, మార్పులకూ సంబంధం ఉండదు. చరిత్ర దాని మానాన అది నడుస్తూనే ఉంటుంది. అయితే అంత మాత్రానే టైలర్లు భయపడాల్సిందేమీ లేదు. ఇది రూపం మార్పు మాత్రమే. జనం బట్టలు తొడిగినన్నాళ్ళూ మా వృత్తికి వచ్చిన డోకా ఏమీ లేదు. నిజానికి యంత్రాలు కార్మికులకు మేలే చేస్తాయి. కాని ప్రస్తుత వ్యవస్థలో గందరగోళం సృష్టిస్తున్నాయి. అందులో ఉన్న మంచి చెడ్డలు చర్చించడమే ఈ నవలలోని కదా వస్తువు. నాకు తెలిసిన జీవితాన్నీ, కళ్ళ ముందు కనిపిస్తున్న మార్పుల్ని, నా అవగాహన మేరకు చిత్రించాను. తప్పులు రాసినట్లుగా మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి. ఈ పుస్తకం మలి ముద్రణకు వస్తే తప్పక సరిజేసుకుంటాను. - వి వెంకట్రావు© 2017,www.logili.com All Rights Reserved.