"సింధునదికి అవలి నుండి వలసవస్తూ తమ వునికినీ, జీవితాన్ని నాశనం చేస్తున్న శత్రువులను విరోచితంగా ఎదుర్కొన్న జాతి ఏది?
భాషల్లో, భావాల్లో, మత సామాజిక నమ్మకాల్లో, పురాణాల్లో, పాఠ్యాంశాల్లో ఆ జాతి చరిత్ర సంస్కృతి, సామాజిక వ్యక్తీకరణ ఎందుకు/ఎలా విస్మృతికి, నిర్లక్ష్యానికి గురయ్యియింది? దీనికి సమాధానమే ఈ చారిత్రక | పరిశోధనాత్మక రచన. నేటి బంగ్లా, బర్మా, ఆర్కాన్ ప్రాంతం నుంచి దిగువన ఉదయగిరి వరకు తెలంగాణతో సహా వున్న సువిశాల ప్రాంతంలో ఒకానొక కాలంలో పరిఢవిల్లిన త్రికళింగదేశ అద్భుత నాగరికతా పరిణామక్రమంలో దాచేస్తే దాగని సత్యాలను విశ్లేషించే రచన ఇది. కేవలం చరిత్రకారుల, సామాజిక శాస్త్రవేత్తలనే కాదు, సామాన్య పాఠకులను కూడా ఆసక్తిగా చదివించే రచన “త్రికళింగ దేశ చరిత్ర”.
- ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ,
ప్రముఖ చరిత్రకారుడు
ఆచార్య కె.యస్.చలం ప్రముఖ రాజకీయ అర్ధ శాస్త్రవేత్త. సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని ఈ దేశానికి అన్వయిస్తున్న కొద్దిమందిలో ఒకరు. తను రాజ్యాంగ పదవిలో వున్నా, వైస్ ఛాన్సలర్ అయినా, ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా పాఠాలు పరిశోధనలు చేసిన తెలుగువాడు, చలం గారి రచనలు అంతర్జాతీయంగా చర్చకు వచ్చాయి. యిప్పటికి ఇంగ్లీష్ లో 27 తెలుగు లో 13 పుస్తకాలు ప్రచురించారు.
"సింధునదికి అవలి నుండి వలసవస్తూ తమ వునికినీ, జీవితాన్ని నాశనం చేస్తున్న శత్రువులను విరోచితంగా ఎదుర్కొన్న జాతి ఏది?
భాషల్లో, భావాల్లో, మత సామాజిక నమ్మకాల్లో, పురాణాల్లో, పాఠ్యాంశాల్లో ఆ జాతి చరిత్ర సంస్కృతి, సామాజిక వ్యక్తీకరణ ఎందుకు/ఎలా విస్మృతికి, నిర్లక్ష్యానికి గురయ్యియింది? దీనికి సమాధానమే ఈ చారిత్రక | పరిశోధనాత్మక రచన. నేటి బంగ్లా, బర్మా, ఆర్కాన్ ప్రాంతం నుంచి దిగువన ఉదయగిరి వరకు తెలంగాణతో సహా వున్న సువిశాల ప్రాంతంలో ఒకానొక కాలంలో పరిఢవిల్లిన త్రికళింగదేశ అద్భుత నాగరికతా పరిణామక్రమంలో దాచేస్తే దాగని సత్యాలను విశ్లేషించే రచన ఇది. కేవలం చరిత్రకారుల, సామాజిక శాస్త్రవేత్తలనే కాదు, సామాన్య పాఠకులను కూడా ఆసక్తిగా చదివించే రచన “త్రికళింగ దేశ చరిత్ర”.
- ప్రొఫెసర్ అడపా సత్యనారాయణ,
ప్రముఖ చరిత్రకారుడు ఆచార్య కె.యస్.చలం ప్రముఖ రాజకీయ అర్ధ శాస్త్రవేత్త. సామాజిక శాస్త్రాల అధ్యయనాన్ని ఈ దేశానికి అన్వయిస్తున్న కొద్దిమందిలో ఒకరు. తను రాజ్యాంగ పదవిలో వున్నా, వైస్ ఛాన్సలర్ అయినా, ఆర్థికశాస్త్ర ఆచార్యునిగా పాఠాలు పరిశోధనలు చేసిన తెలుగువాడు, చలం గారి రచనలు అంతర్జాతీయంగా చర్చకు వచ్చాయి. యిప్పటికి ఇంగ్లీష్ లో 27 తెలుగు లో 13 పుస్తకాలు ప్రచురించారు.