రాజకీయ మంత్రమా? ప్రభుత్వ వ్యతిరేక నినాదమా? మతోన్మాదపు పిలుపా? జాతీయ గీతమా? ఏది?
ఒక గేయం ఇన్ని విభిన్నార్థాలకు, ఊహలకు అవకాశమివ్వడం అపూర్వం. ఈ గేయం ఎంతో కాలం దేశంలో వాదోపవాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. అయితే, "వందేమాతరం" సాధారణ -గీతం కాదు. ఈ గేయాన్ని కొందరు దేశభక్తీ ప్రేరణకు పరాకాష్ఠ అని ప్రస్తుతించారు. దానిలో మత భావప్రేరితమైన విగ్రహారాధనా ఛాయలు కలవని కొందరు తీవ్రంగా నిరసించారు. అయినప్పటికీ 130 సంవత్సరాల తరువాత కూడా భారతదేశంలోని అత్యంత జనరంజకమైన గీతాలలో ఇదొకటని బి బి సి ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. విశ్వభారతి మాజీ వైస్ - ఛాన్సలర్ శ్రీ సబ్యసాచి భట్టాచార్య "వందేమాతరం - గేయ గాథ" అన్న ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలకు, అందుకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానమిచ్చారు.
రాజకీయ మంత్రమా? ప్రభుత్వ వ్యతిరేక నినాదమా? మతోన్మాదపు పిలుపా? జాతీయ గీతమా? ఏది? ఒక గేయం ఇన్ని విభిన్నార్థాలకు, ఊహలకు అవకాశమివ్వడం అపూర్వం. ఈ గేయం ఎంతో కాలం దేశంలో వాదోపవాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. అయితే, "వందేమాతరం" సాధారణ -గీతం కాదు. ఈ గేయాన్ని కొందరు దేశభక్తీ ప్రేరణకు పరాకాష్ఠ అని ప్రస్తుతించారు. దానిలో మత భావప్రేరితమైన విగ్రహారాధనా ఛాయలు కలవని కొందరు తీవ్రంగా నిరసించారు. అయినప్పటికీ 130 సంవత్సరాల తరువాత కూడా భారతదేశంలోని అత్యంత జనరంజకమైన గీతాలలో ఇదొకటని బి బి సి ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనం. విశ్వభారతి మాజీ వైస్ - ఛాన్సలర్ శ్రీ సబ్యసాచి భట్టాచార్య "వందేమాతరం - గేయ గాథ" అన్న ఈ పుస్తకంలో ఈ ప్రశ్నలకు, అందుకు సంబంధించిన ఇతర సందేహాలకు సమాధానమిచ్చారు.© 2017,www.logili.com All Rights Reserved.