మనవి మాటలు
మీరు ఏకీభవించినా, భవించకున్నా; తిట్టినా తిమ్మినా దైవం, దయ్యం పరస్పర ఆశ్రితాలు. ఒకటి లేకపోతే మరొకటి లేదు.
దైవాన్ని నమ్మితే దయ్యాన్ని; దయ్యాన్ని నమ్మితే దైవాన్ని నమ్మితీరాలి. ఒకదాన్ని మాత్రమే నమ్ముతాను అంటే వ్యవహారం నడవదు. దైవం ఉనికి మీద దయ్యం, దయ్యం ఉనికి మీద దైవం ఆధారపడి ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే దయ్యం నుండి రక్షణ కొరకే దైవాన్ని మానవుడు నమ్మటం మొదలెట్టాడు కాబట్టి దైవం దయ్యాలలో దయ్యమే ప్రథమమన్నా అతిశయోక్తి లేదు. ఈ రెండూ రైలుపట్టాల వంటివి. ఒంటి పట్టా మీద నమ్మకం అనే బండి నడవదు.
ఇవే మాటలు మిత్రుడు వైయస్ఆర్గారితో ఉబుసుపోక కబుర్లవేళ అంటే, "అసలండీ, దైవం, దెయ్యమూ మనిషి లేకపోతే లేవు. ఆ యిద్దరూ మానవుడికి ఋణపడి ఉండాలి" అంటూ మరీ యిదిగా పూర్వాశ్రమ వాసనతో మాట్లాడారు. వారు పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు అని నమ్మకస్తులొకరు చెప్పారు.
ఆలోచించి చూస్తే దయ్యం మొండిపదార్థం అనిపిస్తుంది. మన నమ్మకం ప్రకారం దైవం సర్వశక్తిమంతం, విశ్వాధారకం, చరాచర సృష్టి నియంత కదా! .....................
మనవి మాటలు మీరు ఏకీభవించినా, భవించకున్నా; తిట్టినా తిమ్మినా దైవం, దయ్యం పరస్పర ఆశ్రితాలు. ఒకటి లేకపోతే మరొకటి లేదు. దైవాన్ని నమ్మితే దయ్యాన్ని; దయ్యాన్ని నమ్మితే దైవాన్ని నమ్మితీరాలి. ఒకదాన్ని మాత్రమే నమ్ముతాను అంటే వ్యవహారం నడవదు. దైవం ఉనికి మీద దయ్యం, దయ్యం ఉనికి మీద దైవం ఆధారపడి ఉన్నాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే దయ్యం నుండి రక్షణ కొరకే దైవాన్ని మానవుడు నమ్మటం మొదలెట్టాడు కాబట్టి దైవం దయ్యాలలో దయ్యమే ప్రథమమన్నా అతిశయోక్తి లేదు. ఈ రెండూ రైలుపట్టాల వంటివి. ఒంటి పట్టా మీద నమ్మకం అనే బండి నడవదు. ఇవే మాటలు మిత్రుడు వైయస్ఆర్గారితో ఉబుసుపోక కబుర్లవేళ అంటే, "అసలండీ, దైవం, దెయ్యమూ మనిషి లేకపోతే లేవు. ఆ యిద్దరూ మానవుడికి ఋణపడి ఉండాలి" అంటూ మరీ యిదిగా పూర్వాశ్రమ వాసనతో మాట్లాడారు. వారు పూర్వాశ్రమంలో కమ్యూనిస్టు అని నమ్మకస్తులొకరు చెప్పారు. ఆలోచించి చూస్తే దయ్యం మొండిపదార్థం అనిపిస్తుంది. మన నమ్మకం ప్రకారం దైవం సర్వశక్తిమంతం, విశ్వాధారకం, చరాచర సృష్టి నియంత కదా! .....................© 2017,www.logili.com All Rights Reserved.