విమానం ఆవిష్కరణ
I am not afraid of flying.
I am afraid of NOT flying.
రెండు రాంగ్లు కలిసి ఏం చేయలేకపోయారు. కాని రెండు రైట్లు కలిసి ఏం చేసారు?
-విమానం కనిపెట్టారు.
* * *
18వ శతాబ్దంలో అమెరికాలోని ఓ చర్చికి వచ్చిన భక్తుల్లోని ఒకరు చెప్పారు. "మనిషి ఓ రోజు పక్షిలా ఎగిరి దూరప్రయాణాలు చేస్తాడు."
"తప్పు. గాల్లో ఎగరడం దేవతలకే పరిమితం. మనిషికి అది సాధ్యమవుతుందని చెప్పడం దైవద్రోహం." వెంటనే ఆ చర్చ్ బిషప్ మిల్టన్ దాన్ని ఖండిస్తూ చెప్పాడు.
ఆ బిషప్కి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు విల్బర్, ఆర్విల్, రైట్ సోదరులుగా వారు ప్రఖ్యాతిచెందారు.
విమానం అనే కల ప్రాచీన కాలంనించి మనిషికి ఉంది. క్రీస్తు పూర్వం 4000లో చైనాలో తొలిసారిగా గాలిపటాలని కనిపెట్టి ఎగరేసారు. దాంతో మనిషికి విమానం ఆలోచన వచ్చింది. కొందరు రెక్కలు కట్టుకుని టవర్సీమీంచి దూకి ఎగరాలని ప్రయత్నించి మరణించారు. 15వ శతాబ్దంలో చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ విమానం డిజైన్ని రూపొందించాడు. క్రమంగా బెలూన్స్ని కనిపెట్టారు.
బెలూన్ ఆవిష్కరణ : ఫ్రాన్స్కి చెందిన మాంట్ గోల్ఫర్ పదహారుమంది పిల్లల్లోని ఇద్దరు జోసెఫ్. మైఖేల్. వీరు మాంటేగోల్ఫర్ సోదరులుగా ప్రసిద్ధి చెందారు. ఈ సోదరులు వేడిగాలితో నింపిన కాగితం, బట్టనంచీ గాల్లో పైకి లేస్తాయని కనుక్కున్నారు. 4 జూన్ 1783న వాళ్ళ ఊళ్ళోని మార్కెట్ ప్లేస్లో తాము కనుక్కున్న ఆ హాట్ ఏర్ బెలూన్ని ప్రజలకి ప్రదర్శించారు. వారు గడ్డి, ఊలుని బేగ్ కింద మండించడంతో బెలూన్లోని గాలి వేడెక్కి అది 3,000 అడుగుల పైకి లేచి, అక్కడ 10 నిమిషాలు నిలిచి, తర్వాత మైలున్నర దూరంలో దిగింది. వాళ్ళు పేరిస్, వర్సైల్స్ నగరాల్లో కూడా ఈ ప్రదర్శనని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 1783న బెలూన్లో ఓ గొర్రెని, పుంజుని, బాతుని ఉంచి పంపారు. అది 8 నిమిషాలు గాల్లో ఉండి రెండు మైళ్ళ దూరంలో భద్రంగా దిగింది. 1796లో మాంట్ గోల్ఫియర్ బ్రదర్స్ కనిపెట్టిన ఓ బెలూనిని వియన్నాలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు.
18వ శతాబ్దంలో హైడ్రోజన్ గేస్ కనుక్కున్నాక గాల్లో తేలే హైడ్రో బెలూన్స్ని కనుక్కున్నారు. 21 నవంబర్ 1783 మొదటిసారి పిలాటే డిరోజియర్, ఫ్రాంకోయిస్ లారెంట్లు బెలూన్లో పేరిస్ నగరం మీద ఐదున్నర మైళ్ళు 25 నిమిషాలసేపు ప్రయాణించి భూమిమీదకి క్షేమంగా దిగారు. ఇదే మనిషి ఆధీనంలోని..............................
విమానం ఆవిష్కరణ I am not afraid of flying. I am afraid of NOT flying. రెండు రాంగ్లు కలిసి ఏం చేయలేకపోయారు. కాని రెండు రైట్లు కలిసి ఏం చేసారు? -విమానం కనిపెట్టారు. * * * 18వ శతాబ్దంలో అమెరికాలోని ఓ చర్చికి వచ్చిన భక్తుల్లోని ఒకరు చెప్పారు. "మనిషి ఓ రోజు పక్షిలా ఎగిరి దూరప్రయాణాలు చేస్తాడు." "తప్పు. గాల్లో ఎగరడం దేవతలకే పరిమితం. మనిషికి అది సాధ్యమవుతుందని చెప్పడం దైవద్రోహం." వెంటనే ఆ చర్చ్ బిషప్ మిల్టన్ దాన్ని ఖండిస్తూ చెప్పాడు. ఆ బిషప్కి ఇద్దరు కొడుకులు. వారి పేర్లు విల్బర్, ఆర్విల్, రైట్ సోదరులుగా వారు ప్రఖ్యాతిచెందారు. విమానం అనే కల ప్రాచీన కాలంనించి మనిషికి ఉంది. క్రీస్తు పూర్వం 4000లో చైనాలో తొలిసారిగా గాలిపటాలని కనిపెట్టి ఎగరేసారు. దాంతో మనిషికి విమానం ఆలోచన వచ్చింది. కొందరు రెక్కలు కట్టుకుని టవర్సీమీంచి దూకి ఎగరాలని ప్రయత్నించి మరణించారు. 15వ శతాబ్దంలో చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ విమానం డిజైన్ని రూపొందించాడు. క్రమంగా బెలూన్స్ని కనిపెట్టారు. బెలూన్ ఆవిష్కరణ : ఫ్రాన్స్కి చెందిన మాంట్ గోల్ఫర్ పదహారుమంది పిల్లల్లోని ఇద్దరు జోసెఫ్. మైఖేల్. వీరు మాంటేగోల్ఫర్ సోదరులుగా ప్రసిద్ధి చెందారు. ఈ సోదరులు వేడిగాలితో నింపిన కాగితం, బట్టనంచీ గాల్లో పైకి లేస్తాయని కనుక్కున్నారు. 4 జూన్ 1783న వాళ్ళ ఊళ్ళోని మార్కెట్ ప్లేస్లో తాము కనుక్కున్న ఆ హాట్ ఏర్ బెలూన్ని ప్రజలకి ప్రదర్శించారు. వారు గడ్డి, ఊలుని బేగ్ కింద మండించడంతో బెలూన్లోని గాలి వేడెక్కి అది 3,000 అడుగుల పైకి లేచి, అక్కడ 10 నిమిషాలు నిలిచి, తర్వాత మైలున్నర దూరంలో దిగింది. వాళ్ళు పేరిస్, వర్సైల్స్ నగరాల్లో కూడా ఈ ప్రదర్శనని ఇచ్చారు. 19 సెప్టెంబర్ 1783న బెలూన్లో ఓ గొర్రెని, పుంజుని, బాతుని ఉంచి పంపారు. అది 8 నిమిషాలు గాల్లో ఉండి రెండు మైళ్ళ దూరంలో భద్రంగా దిగింది. 1796లో మాంట్ గోల్ఫియర్ బ్రదర్స్ కనిపెట్టిన ఓ బెలూనిని వియన్నాలోని ఓ మ్యూజియంలో భద్రపరిచారు. 18వ శతాబ్దంలో హైడ్రోజన్ గేస్ కనుక్కున్నాక గాల్లో తేలే హైడ్రో బెలూన్స్ని కనుక్కున్నారు. 21 నవంబర్ 1783 మొదటిసారి పిలాటే డిరోజియర్, ఫ్రాంకోయిస్ లారెంట్లు బెలూన్లో పేరిస్ నగరం మీద ఐదున్నర మైళ్ళు 25 నిమిషాలసేపు ప్రయాణించి భూమిమీదకి క్షేమంగా దిగారు. ఇదే మనిషి ఆధీనంలోని..............................© 2017,www.logili.com All Rights Reserved.