శాస్త్ర ప్రశంస
ప్రాచీన జ్యోతిష్య జాతక భావఫల లక్షణాన్ని తెలిపే ప్రధాన లక్షణ గ్రంథములు ఎన్నో భారతదేశంలో విశేష ప్రచారం పొందాయి. వీటి ఆధారంగా మనుషుల పుట్టుక స్వరూపాన్ని మరింత విస్పష్టంగాను, సర్వజన సుబోధకంగాను ఆవిష్కరించడం ఈ జాతకుని జన్మకాల లగ్న గణిత విద్యాబోధిని లక్ష్యం. అందులో విశేష లక్షణాలను సామాన్య భాషాపరంగా ఎన్నో అద్భుత విషయాలను ఈ గ్రంథం వివరించుచున్నది.
ఈ భూమండలంపైన జీవించే ప్రతి మానవుడు నవగ్రహాల ప్రభావంతోనే ఉ టాడు. వాటి నిర్దేశ సూత్రాలపైనే మానవుని మనుగడ సాగుతుంది. గ్రహసంబంధంగా మనమేమిటో తెలిసికొని, మనలో దాగియున్న ప్రతిభతో దోషాలను గుర్తించి మనలను విజయపథం వైపు నడిపించేదే శాస్త్రము. నిత్యజీవితంలోను ప్రతి పనికి ఈ శాస్త్రంతో సంబంధం వుంది. భారతదేశంలో పుట్టిన అనేకమంది జ్యోతిష్యశాస్త్రం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
జ్యోతి అనగా వెలుగు, నక్షత్రము, కన్ను, సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి. ప్రాచీన కాలంలో ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైన కాంతి గోళాలను గుర్తించి ఆ కాంతిని ఆనందించడం, సర్వసామాన్యంగా జరిగిందని ఊహించవచ్చును. ఈ గ్రహాల గురించి కుతూహలంగా పరిశీలన, ప్రాణులపై వాటి ప్రభావం, వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, మానవ జీవితాలతో వాటికున్న సంబంధం మొదలైనవి జ్యోతిశ్శాస్త్రారంభానికి కారణాలు...............
శాస్త్ర ప్రశంస ప్రాచీన జ్యోతిష్య జాతక భావఫల లక్షణాన్ని తెలిపే ప్రధాన లక్షణ గ్రంథములు ఎన్నో భారతదేశంలో విశేష ప్రచారం పొందాయి. వీటి ఆధారంగా మనుషుల పుట్టుక స్వరూపాన్ని మరింత విస్పష్టంగాను, సర్వజన సుబోధకంగాను ఆవిష్కరించడం ఈ జాతకుని జన్మకాల లగ్న గణిత విద్యాబోధిని లక్ష్యం. అందులో విశేష లక్షణాలను సామాన్య భాషాపరంగా ఎన్నో అద్భుత విషయాలను ఈ గ్రంథం వివరించుచున్నది. ఈ భూమండలంపైన జీవించే ప్రతి మానవుడు నవగ్రహాల ప్రభావంతోనే ఉ టాడు. వాటి నిర్దేశ సూత్రాలపైనే మానవుని మనుగడ సాగుతుంది. గ్రహసంబంధంగా మనమేమిటో తెలిసికొని, మనలో దాగియున్న ప్రతిభతో దోషాలను గుర్తించి మనలను విజయపథం వైపు నడిపించేదే శాస్త్రము. నిత్యజీవితంలోను ప్రతి పనికి ఈ శాస్త్రంతో సంబంధం వుంది. భారతదేశంలో పుట్టిన అనేకమంది జ్యోతిష్యశాస్త్రం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. జ్యోతి అనగా వెలుగు, నక్షత్రము, కన్ను, సూర్యుడు అనే అర్ధాలు వున్నాయి. ప్రాచీన కాలంలో ఆకాశంలో కనిపించే సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాలు మొదలైన కాంతి గోళాలను గుర్తించి ఆ కాంతిని ఆనందించడం, సర్వసామాన్యంగా జరిగిందని ఊహించవచ్చును. ఈ గ్రహాల గురించి కుతూహలంగా పరిశీలన, ప్రాణులపై వాటి ప్రభావం, వాతావరణంలో క్రమబద్ధమైన మార్పులు, మానవ జీవితాలతో వాటికున్న సంబంధం మొదలైనవి జ్యోతిశ్శాస్త్రారంభానికి కారణాలు...............© 2017,www.logili.com All Rights Reserved.