ప్రొలాగ్
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని నంబర్ 630, శాస్సోమ్ స్ట్రీట్.
ఆ మూడంతస్తుల బిల్డింగ్ బయట అప్రయిజర్స్ బిల్డింగ్ అనే నేమ్ బోర్డ్ ఉంది. ఆ బిల్డింగ్లో అమెరికన్ ఐ.ఎన్.ఎస్. ఆఫీస్ ఉంది. ఐ.ఎన్.ఎస్.కి ఫుల్ఫామ్ ఇమిగ్రేషన్ అండ్ నేచురలైజేషన్ సర్వీస్. అమెరికాకి స్వల్పకాలవని మీద కాని, లేదా అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి కాని విదేశాలనించి వచ్చేవారి విషయాలని చూసే అమెరికన్ ప్రభుత్వశాఖ అది
కేలిఫోర్నియా రాష్ట్రంలోని అలాంటి ఆరు ఆఫీసుల్లో ఇదొకటి. అలాగే అమెరికా అంతటా ఉన్న అరవై నాలుగు లోకల్ ఆఫీసుల్లో ఇది కూడా ఒకటి.
ఐ.ఎన్.ఎస్.లో పనిచేసే స్పెషల్ ఏజెంట్ జేమ్స్ మిల్లర్ డ్రైవ్ చేస్తున్న కారు సరిగ్గా ఉదయం తొమ్మిదికి ఆ బిల్డింగ్లోని పార్కింగ్ లాట్లో ఆగింది. కారు ఎడమవైపు డ్రైవింగ్ సీట్ తలుపు తెరుచుకుని అతను పక్క సీట్లోని తన బ్రీఫ్ కేస్ని అందుకుని దిగి కారు డోర్ లాక్ చేసాడు. ఆ బిల్డింగ్ మీద నించి ఎగురుతున్న నక్షత్రాలు, గీతలు గల రెడ్ అండ్ బ్లూ అమెరికన్ జాతీయ పతాకం వంక ఓసారి యధాలాపంగా చూసి ఎంట్రన్స్ డోర్ వైపు నడిచాడు.
"నా పేరు జేమ్స్ మిల్లర్. వెస్ట్రన్ సర్వీస్ సెంటర్ నించి వస్తున్నాను." యూనిఫాంలో ఉన్న అతను రిసెప్షన్ దగ్గర ఆగి ఇంగ్లీష్ చెప్పాడు.
'వెస్ట్రన్ సర్వీస్ సెంటర్' అన్న పేరు వినగానే రిసెప్షనిస్ట్ మొహంలోకి అలర్ట్విస్ ప్రవేశించింది. అందుకు కారణం ఆ రిసెప్షనిస్ట్ పనిచేసే శాన్ఫ్రాన్సిస్కో ఆఫీస్కి కాలిఫోర్నియా రాష్ట్రంలోని 'లగువా హిల్' అనే చిన్న ఊళ్ళో ఉన్న వెస్ట్రన్ సర్వీస్ సెంటర్ హెడ్ క్వార్టర్స్, అంతే కాదు. స్పెషల్ ఏజెంట్లకి అధికారాలు విస్తారంగా ఉంటాయి. అమెరికాలోని అరవై లోకల్ ఐ.ఎన్.ఎస్. ఆఫీసులు, నాలుగు రీజనల్ సర్వీస్ సెంటర్స్ - ఈస్ట్రన్, సదరన్, నార్తరన్, వెస్ట్రన్ సర్వీస్ సెంటర్స్ ఆధీనంలో ఉంటాయి.........................
ప్రొలాగ్ శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని నంబర్ 630, శాస్సోమ్ స్ట్రీట్. ఆ మూడంతస్తుల బిల్డింగ్ బయట అప్రయిజర్స్ బిల్డింగ్ అనే నేమ్ బోర్డ్ ఉంది. ఆ బిల్డింగ్లో అమెరికన్ ఐ.ఎన్.ఎస్. ఆఫీస్ ఉంది. ఐ.ఎన్.ఎస్.కి ఫుల్ఫామ్ ఇమిగ్రేషన్ అండ్ నేచురలైజేషన్ సర్వీస్. అమెరికాకి స్వల్పకాలవని మీద కాని, లేదా అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి కాని విదేశాలనించి వచ్చేవారి విషయాలని చూసే అమెరికన్ ప్రభుత్వశాఖ అది కేలిఫోర్నియా రాష్ట్రంలోని అలాంటి ఆరు ఆఫీసుల్లో ఇదొకటి. అలాగే అమెరికా అంతటా ఉన్న అరవై నాలుగు లోకల్ ఆఫీసుల్లో ఇది కూడా ఒకటి. ఐ.ఎన్.ఎస్.లో పనిచేసే స్పెషల్ ఏజెంట్ జేమ్స్ మిల్లర్ డ్రైవ్ చేస్తున్న కారు సరిగ్గా ఉదయం తొమ్మిదికి ఆ బిల్డింగ్లోని పార్కింగ్ లాట్లో ఆగింది. కారు ఎడమవైపు డ్రైవింగ్ సీట్ తలుపు తెరుచుకుని అతను పక్క సీట్లోని తన బ్రీఫ్ కేస్ని అందుకుని దిగి కారు డోర్ లాక్ చేసాడు. ఆ బిల్డింగ్ మీద నించి ఎగురుతున్న నక్షత్రాలు, గీతలు గల రెడ్ అండ్ బ్లూ అమెరికన్ జాతీయ పతాకం వంక ఓసారి యధాలాపంగా చూసి ఎంట్రన్స్ డోర్ వైపు నడిచాడు. "నా పేరు జేమ్స్ మిల్లర్. వెస్ట్రన్ సర్వీస్ సెంటర్ నించి వస్తున్నాను." యూనిఫాంలో ఉన్న అతను రిసెప్షన్ దగ్గర ఆగి ఇంగ్లీష్ చెప్పాడు. 'వెస్ట్రన్ సర్వీస్ సెంటర్' అన్న పేరు వినగానే రిసెప్షనిస్ట్ మొహంలోకి అలర్ట్విస్ ప్రవేశించింది. అందుకు కారణం ఆ రిసెప్షనిస్ట్ పనిచేసే శాన్ఫ్రాన్సిస్కో ఆఫీస్కి కాలిఫోర్నియా రాష్ట్రంలోని 'లగువా హిల్' అనే చిన్న ఊళ్ళో ఉన్న వెస్ట్రన్ సర్వీస్ సెంటర్ హెడ్ క్వార్టర్స్, అంతే కాదు. స్పెషల్ ఏజెంట్లకి అధికారాలు విస్తారంగా ఉంటాయి. అమెరికాలోని అరవై లోకల్ ఐ.ఎన్.ఎస్. ఆఫీసులు, నాలుగు రీజనల్ సర్వీస్ సెంటర్స్ - ఈస్ట్రన్, సదరన్, నార్తరన్, వెస్ట్రన్ సర్వీస్ సెంటర్స్ ఆధీనంలో ఉంటాయి.........................© 2017,www.logili.com All Rights Reserved.