జల సమాధి
రాత్రి పదికావస్తుంది.
మెల్లిగా కదుల్తున్న వ్యాన్ రోడ్డు వారగా ఆగింది.
స్టీరింగ్ వెనకనుంచీ జానీ ఒక్క ఉరుకులో కిందికి దిగాడు. అతని ఎడమచెయ్యి నిర్లక్ష్యంగా, విసురుగా డోర్ని తోసింది. పెద్ద చప్పుడుతో డోర్ మూసుకుంది. వ్యాన్ ముందునుంచీ నడుస్తూ అతను పేవ్మెంట్ మీదికి ఎక్కాడు.
కిందికి దిగి, రెండో డోర్ని మూసిన మోతీ నవ్వుతూ తన మిత్రుణ్ణి చూశాడు. "నీ విసురుకి పనయ్యేదాకా వ్యాన్ కీళ్ళు భద్రంగా వుంటాయన్న నమ్మకం లేదు "నాకు!".
జానీ మాట్లాడకుండా పాంటు జేబులోంచి సిగరెట్ పాకెట్ తీశాడు. పెదాలమధ్య సిగరెట్ని దూర్చాడు. జానీ పళ్ళ మధ్య సిగరెట్ ఎర్రగా వెలిగింది. కళ్ళల్లో ఆ మంట ఎర్రగా ప్రతిఫలించింది.
"కమాన్! ముసలి పీనుగ కొట్టు కట్టేసేలా వున్నాడు!" అంటూ జానీ కదిలాడు. పొడుగాటి అతని ఆకారాన్ని మోతీ వెంబడించాడు.
తలుపుల్ని మూయబోతున్న 'హెవెన్ కాఫిన్ ఎంటర్ ప్రైజ్' సోల్ ప్రొప్రయిటర్ అబ్రహాం ఆగి, వాళ్ళవైపు ప్రశ్నార్థకంగా చూశాడు.
"పనిమీద వచ్చారా?" ఆశగా ప్రశ్నించాడతను. బ్లాక్ సూట్ లో వున్న అతన్ని జానీ ఎర్రటి కళ్ళతో చూశాడు.
"శ్మశానానికీ, నీ షాపుకీ మనుషులు ఊరికేరారు, బాబాయ్!" జానీ నవ్వుతూ అన్నాడు. మోతీ గొల్లున నవ్వాడు. ఇంకా రాలిపోకుండా వున్న నాలుగు పళ్ళని చూపిస్తూ అబ్రహాం నవ్వాడు.............................
జల సమాధి రాత్రి పదికావస్తుంది. మెల్లిగా కదుల్తున్న వ్యాన్ రోడ్డు వారగా ఆగింది. స్టీరింగ్ వెనకనుంచీ జానీ ఒక్క ఉరుకులో కిందికి దిగాడు. అతని ఎడమచెయ్యి నిర్లక్ష్యంగా, విసురుగా డోర్ని తోసింది. పెద్ద చప్పుడుతో డోర్ మూసుకుంది. వ్యాన్ ముందునుంచీ నడుస్తూ అతను పేవ్మెంట్ మీదికి ఎక్కాడు. కిందికి దిగి, రెండో డోర్ని మూసిన మోతీ నవ్వుతూ తన మిత్రుణ్ణి చూశాడు. "నీ విసురుకి పనయ్యేదాకా వ్యాన్ కీళ్ళు భద్రంగా వుంటాయన్న నమ్మకం లేదు "నాకు!". జానీ మాట్లాడకుండా పాంటు జేబులోంచి సిగరెట్ పాకెట్ తీశాడు. పెదాలమధ్య సిగరెట్ని దూర్చాడు. జానీ పళ్ళ మధ్య సిగరెట్ ఎర్రగా వెలిగింది. కళ్ళల్లో ఆ మంట ఎర్రగా ప్రతిఫలించింది. "కమాన్! ముసలి పీనుగ కొట్టు కట్టేసేలా వున్నాడు!" అంటూ జానీ కదిలాడు. పొడుగాటి అతని ఆకారాన్ని మోతీ వెంబడించాడు. తలుపుల్ని మూయబోతున్న 'హెవెన్ కాఫిన్ ఎంటర్ ప్రైజ్' సోల్ ప్రొప్రయిటర్ అబ్రహాం ఆగి, వాళ్ళవైపు ప్రశ్నార్థకంగా చూశాడు. "పనిమీద వచ్చారా?" ఆశగా ప్రశ్నించాడతను. బ్లాక్ సూట్ లో వున్న అతన్ని జానీ ఎర్రటి కళ్ళతో చూశాడు. "శ్మశానానికీ, నీ షాపుకీ మనుషులు ఊరికేరారు, బాబాయ్!" జానీ నవ్వుతూ అన్నాడు. మోతీ గొల్లున నవ్వాడు. ఇంకా రాలిపోకుండా వున్న నాలుగు పళ్ళని చూపిస్తూ అబ్రహాం నవ్వాడు.............................© 2017,www.logili.com All Rights Reserved.