మాటకారి బిందు
బిందు మాధవ్ పాటిల్ సినిమా నటుడిలా అందంగా ఉండే యువకుడు. అతను చెక్కినట్టున్న ముఖకవళికలతో, భారీ శరీరంతో, తలమీద పట్టులాటి నల్లటి ఒత్తు జుట్టుతో ఉండేవాడు. అన్నిటికన్న ముఖ్యంగా ఎప్పుడూ చెరగని నవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు.
అతను ఎవరినీ ఎప్పుడూ ఇంటికి రమ్మనేవాడు కాదు. తనే అందరి ఇళ్ళకు వెళ్ళొచ్చేవాడు. ఒకసారి మా అవ్వ నాకు పురమాయించిన పని వలన నేను అతని ఇంటికి వెళ్ళాలిసి వచ్చింది.
నాకు అతని ఇల్లు ఎక్కడుందో సరిగా తెలీదు. అతడి ఇల్లు ఎక్కడ అని అడగడానికి సంకోచించాను. మా ఊరిలో ఎక్కడా కూడళ్ళు, పెద్ద వీధులు లేవు.
మా ఊరిలో చిరునామా కావాలంటే వర్ణించి చెప్పి తెలుసుకోవాలి. మా ఇల్లు ఎక్కడ అని చెప్పాలంటే డాక్టర్ కులకర్ణి ఇల్లు అని చెప్పేందుకు అక్కడ ముందు మా కుటుంబ చరిత్ర చెప్పాలి - 'ఆ డాక్టరు మంచివాడు. ఆయనకు ఒక తెల్ల కుక్క ఉంది. అది ఎప్పుడూ వాకిలి దగ్గర నిద్రపోతూ ఎవరేనా కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని స్నేహపూర్వకంగా పలకరిస్తుంది. కానీ ఏవేనా కుక్కలు వస్తే మటుకు చాలా చిరాకు పడుతుంది. డాక్టరుకు ఒక్కడే కొడుకు. అతను పంజాబీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు' అంటూ చెప్పుకుంటూ
రావాలి.
ఓహో! ఆ డాక్టరు కులకర్ణియా? ఎడమకి తిరిగి కుడివైపు మళ్ళి మొదట ఎడమ సందులో ఎడమ నుంచి మూడో ఇల్లు అంటారు.
అలాటి వివరాలు చెప్పి నేను బిందు ఇల్లు ఎలా కనుక్కోవాలా అని ఆశ్చర్యపోయాను.
కానీ బిందు చాలా తేలిగ్గా చెప్పేశాడు. "నల్లీ! చాలా తేలికగా కనుక్కోవచ్చు. నేతాజీనగర్ వెళ్ళే బస్సు ఎక్కు చివరిస్టాపులో దిగు. పది అడుగులు ముందుకు నడిస్తే................
మాటకారి బిందు బిందు మాధవ్ పాటిల్ సినిమా నటుడిలా అందంగా ఉండే యువకుడు. అతను చెక్కినట్టున్న ముఖకవళికలతో, భారీ శరీరంతో, తలమీద పట్టులాటి నల్లటి ఒత్తు జుట్టుతో ఉండేవాడు. అన్నిటికన్న ముఖ్యంగా ఎప్పుడూ చెరగని నవ్వుతో ఆత్మవిశ్వాసంతో ఉండేవాడు. అతను ఎవరినీ ఎప్పుడూ ఇంటికి రమ్మనేవాడు కాదు. తనే అందరి ఇళ్ళకు వెళ్ళొచ్చేవాడు. ఒకసారి మా అవ్వ నాకు పురమాయించిన పని వలన నేను అతని ఇంటికి వెళ్ళాలిసి వచ్చింది. నాకు అతని ఇల్లు ఎక్కడుందో సరిగా తెలీదు. అతడి ఇల్లు ఎక్కడ అని అడగడానికి సంకోచించాను. మా ఊరిలో ఎక్కడా కూడళ్ళు, పెద్ద వీధులు లేవు. మా ఊరిలో చిరునామా కావాలంటే వర్ణించి చెప్పి తెలుసుకోవాలి. మా ఇల్లు ఎక్కడ అని చెప్పాలంటే డాక్టర్ కులకర్ణి ఇల్లు అని చెప్పేందుకు అక్కడ ముందు మా కుటుంబ చరిత్ర చెప్పాలి - 'ఆ డాక్టరు మంచివాడు. ఆయనకు ఒక తెల్ల కుక్క ఉంది. అది ఎప్పుడూ వాకిలి దగ్గర నిద్రపోతూ ఎవరేనా కొత్తవాళ్ళు వస్తే వాళ్ళని స్నేహపూర్వకంగా పలకరిస్తుంది. కానీ ఏవేనా కుక్కలు వస్తే మటుకు చాలా చిరాకు పడుతుంది. డాక్టరుకు ఒక్కడే కొడుకు. అతను పంజాబీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు' అంటూ చెప్పుకుంటూ రావాలి. ఓహో! ఆ డాక్టరు కులకర్ణియా? ఎడమకి తిరిగి కుడివైపు మళ్ళి మొదట ఎడమ సందులో ఎడమ నుంచి మూడో ఇల్లు అంటారు. అలాటి వివరాలు చెప్పి నేను బిందు ఇల్లు ఎలా కనుక్కోవాలా అని ఆశ్చర్యపోయాను. కానీ బిందు చాలా తేలిగ్గా చెప్పేశాడు. "నల్లీ! చాలా తేలికగా కనుక్కోవచ్చు. నేతాజీనగర్ వెళ్ళే బస్సు ఎక్కు చివరిస్టాపులో దిగు. పది అడుగులు ముందుకు నడిస్తే................© 2017,www.logili.com All Rights Reserved.