మనుషులు అనేక కారణాలకి చంపుతుంటారు. నన్నడిగితే మనిషితో 'నువ్వంటే నాకిష్టం లేదోయ్' అని చెప్పడానికి చక్కటి మార్గం చంపడం. ఇలా పరిస్థితికి అనుగుణంగా చంపే, చంపబడే ఎందరినో మీరు ఈ కథల్లో కలుసుకోవచ్చు. దీనికి చావుకి చిరునామా పేరు న్యాయమే కదా మరి?
చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్యలు ఉండడం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. సస్పెన్సుతో సాగుతూ ఇందులోని ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తయి, మీరు అలవాటు పడ్డ తెలుగు రచయితల కథలకి విభిన్నంగా ఉంటుంది. మంచి కథని చదివామనే తృప్తిని పాఠకులకి ఇస్తుంది. దీన్ని బుక్ షెల్ఫ్ లో సిద్ధంగా ఉంచుకోండి. ఏం తోచనప్పుడు, ప్రయాణాల్లో, కాలక్షేపానికి చదవడానికి 'చావుకి చిరునామా' మంచి పుస్తకం.
మనుషులు అనేక కారణాలకి చంపుతుంటారు. నన్నడిగితే మనిషితో 'నువ్వంటే నాకిష్టం లేదోయ్' అని చెప్పడానికి చక్కటి మార్గం చంపడం. ఇలా పరిస్థితికి అనుగుణంగా చంపే, చంపబడే ఎందరినో మీరు ఈ కథల్లో కలుసుకోవచ్చు. దీనికి చావుకి చిరునామా పేరు న్యాయమే కదా మరి? చావుకి చిరునామా అనే పేరుని బట్టే ఈ సంపుటిలోని కథల ప్రత్యేకత తెలిసిపోతుంది. ప్రతీ కథలో హత్యలు ఉండడం లేదా అది జరిగే సూచనతో పూర్తవడం ఆ ప్రత్యేకత. అనువాదంలో చేయి తిరిగిన మల్లాది వెంకట కృష్ణమూర్తి అనువాదం కనుక వెరైటీ ఇతివృత్తాలు గల ఈ క్రయిమ్ కథలు హాయిగా చదివేయచ్చు. సస్పెన్సుతో సాగుతూ ఇందులోని ప్రతీ కథా అనూహ్యమైన మలుపుతో పూర్తయి, మీరు అలవాటు పడ్డ తెలుగు రచయితల కథలకి విభిన్నంగా ఉంటుంది. మంచి కథని చదివామనే తృప్తిని పాఠకులకి ఇస్తుంది. దీన్ని బుక్ షెల్ఫ్ లో సిద్ధంగా ఉంచుకోండి. ఏం తోచనప్పుడు, ప్రయాణాల్లో, కాలక్షేపానికి చదవడానికి 'చావుకి చిరునామా' మంచి పుస్తకం.
© 2017,www.logili.com All Rights Reserved.