డీహ్యూమనైజేషన్ బ్రాండ్ ఎఐ (వర్షన్ 2024)
ఈ గులాబి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాను.
దీన్ని ఓ హత్యాస్థలంలో ఉంచాలి.
అక్కడ దొర్లి దొర్లి పొగిలి పొగిలి ఏడ్వాలి.
నా కన్నీటితో రక్తంతో తడిసిన ఆ నేలలో నన్ను పాతుకోవాలి.
కానీ బాబొరే! నేను ఏడుపు మర్చిపోయాన్రా
నన్ను పాతిపెట్టినది గుర్తుంది, ఎక్కడో గుర్తులేదు
నా హత్య గుర్తుంది, హత్యాస్థలం గుర్తులేదు
ఓటీపీలేదు, పాస్వర్డ్ లేదు, లొకేషన్ దొరకట్లేదు
చేతిలో పట్టుకున్నది కాగితం గులాబి పువ్వు కాదు
ప్లాస్టిక్ పువ్వూ కాదు.. ఇదేదో కొత్త మెటీరియల్
దీని మీద ఎండిపోయిన కన్నీటి చారిక మాత్రం నాదే
దీని మీద గడ్డకట్టిన రక్తంబొట్టు నాదే
అప్పుడెప్పుడో ఒకరోజు గులాబీని ముద్దెట్టుకోబోయాను
నా పెదాలకి ఉప్పగా నెత్తుటి వాసన
ఆనక సర్జరీ చేసి కొత్త నాలుక ఏశారు.
ఇపుడు కన్నీటి రుచి తెలియడం లేదు
మెదడు కూడా మొన్ననే గ్రాండ్ గా లాంచ్ చేసిన లేటెస్ట్ వెర్షన్................
డీహ్యూమనైజేషన్ బ్రాండ్ ఎఐ (వర్షన్ 2024) ఈ గులాబి పువ్వు పట్టుకుని తిరుగుతున్నాను. దీన్ని ఓ హత్యాస్థలంలో ఉంచాలి. అక్కడ దొర్లి దొర్లి పొగిలి పొగిలి ఏడ్వాలి. నా కన్నీటితో రక్తంతో తడిసిన ఆ నేలలో నన్ను పాతుకోవాలి. కానీ బాబొరే! నేను ఏడుపు మర్చిపోయాన్రా నన్ను పాతిపెట్టినది గుర్తుంది, ఎక్కడో గుర్తులేదు నా హత్య గుర్తుంది, హత్యాస్థలం గుర్తులేదు ఓటీపీలేదు, పాస్వర్డ్ లేదు, లొకేషన్ దొరకట్లేదు చేతిలో పట్టుకున్నది కాగితం గులాబి పువ్వు కాదు ప్లాస్టిక్ పువ్వూ కాదు.. ఇదేదో కొత్త మెటీరియల్ దీని మీద ఎండిపోయిన కన్నీటి చారిక మాత్రం నాదే దీని మీద గడ్డకట్టిన రక్తంబొట్టు నాదే అప్పుడెప్పుడో ఒకరోజు గులాబీని ముద్దెట్టుకోబోయాను నా పెదాలకి ఉప్పగా నెత్తుటి వాసన ఆనక సర్జరీ చేసి కొత్త నాలుక ఏశారు. ఇపుడు కన్నీటి రుచి తెలియడం లేదు మెదడు కూడా మొన్ననే గ్రాండ్ గా లాంచ్ చేసిన లేటెస్ట్ వెర్షన్................
© 2017,www.logili.com All Rights Reserved.