గాగీ! గీగా!
మనమో కుక్కపిల్లను పెంచి పెద్దచేద్దాం. అదే మన కొడుకు అనుకుందాం. మిమ్మల్ని పున్నామనరకం నుంచి తప్పిస్తుందని తలపోద్దాం” అంది తరంగం. భర్తకి అనురాగ రాగాల రుచి చూపిస్తూ.
"నీ తలపులతో నాకు తలంటిపోయడం బాగానే ఉందిగానీ, ఆ కుమార సంభవానికి మాటలు రావాలి. మంతనాలు కావాలి. సంపాయించడం తెలియాలి.మనల్ని కావడిలో మోసుకెళ్తూ తీర్థయాత్రలు తిప్పాలి.”
నవ్వుతున్న ఆలోచనతో అన్నాడు ధరావత్తు.
"చాల్లెండి! మీ వేళాకోళం గోళం గొళ్ళెం! పుత్రోత్సాహానికి నేనో తరుణోపాయం చెప్పా. మిగిలింది మీ ఇష్టం. మీరు కాదన్నది ఔనని అనేదాన్నే అయితే మీదాన్నే అయ్యేదాన్ని కాదు” అంది.
“ఔనన్నా కాదన్నా, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమనేగా మనం ఇంకో సంతు వద్దనుకున్నాం.”
“ఈ సంతానం కోసం నవమాసాలు మోయనక్కర్లేదు. ప్రసూతాసుపత్రి ఖర్చులేదు. బారసాలలూ, బర్త్ డేలూ జరపాల్సిన పనిలేదు. ఏదో మనం వండుకునే ముద్ద ఒకటి ఎక్కువ చేయడమేగా” అంది భర్త మాట మధ్యలో.
"అదేదో మనం వదిలేసిన మెతుకులు గతికి బతికే ఏ పురుగో, బూచో అనుకున్నావా, అసలు మెతుకులు వదిలేసే శక్తి మనకుందా అని” .........................
గాగీ! గీగా! మనమో కుక్కపిల్లను పెంచి పెద్దచేద్దాం. అదే మన కొడుకు అనుకుందాం. మిమ్మల్ని పున్నామనరకం నుంచి తప్పిస్తుందని తలపోద్దాం” అంది తరంగం. భర్తకి అనురాగ రాగాల రుచి చూపిస్తూ. "నీ తలపులతో నాకు తలంటిపోయడం బాగానే ఉందిగానీ, ఆ కుమార సంభవానికి మాటలు రావాలి. మంతనాలు కావాలి. సంపాయించడం తెలియాలి.మనల్ని కావడిలో మోసుకెళ్తూ తీర్థయాత్రలు తిప్పాలి.” నవ్వుతున్న ఆలోచనతో అన్నాడు ధరావత్తు. "చాల్లెండి! మీ వేళాకోళం గోళం గొళ్ళెం! పుత్రోత్సాహానికి నేనో తరుణోపాయం చెప్పా. మిగిలింది మీ ఇష్టం. మీరు కాదన్నది ఔనని అనేదాన్నే అయితే మీదాన్నే అయ్యేదాన్ని కాదు” అంది. “ఔనన్నా కాదన్నా, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమనేగా మనం ఇంకో సంతు వద్దనుకున్నాం.” “ఈ సంతానం కోసం నవమాసాలు మోయనక్కర్లేదు. ప్రసూతాసుపత్రి ఖర్చులేదు. బారసాలలూ, బర్త్ డేలూ జరపాల్సిన పనిలేదు. ఏదో మనం వండుకునే ముద్ద ఒకటి ఎక్కువ చేయడమేగా” అంది భర్త మాట మధ్యలో. "అదేదో మనం వదిలేసిన మెతుకులు గతికి బతికే ఏ పురుగో, బూచో అనుకున్నావా, అసలు మెతుకులు వదిలేసే శక్తి మనకుందా అని” .........................© 2017,www.logili.com All Rights Reserved.