నీలి లోలాకు
అతను చుట్టూచూశాడు.
కనుచూపుమేరా. మౌనంగా.
నీలార్జవం. అతనిచుట్టూ. అతనిలోలోన.
ఆకాశం అంతా ఖాళీ అయ్యింది. మచ్చుకొక్కచుక్కయినా లేకుండా.
అప్పటిదాకా స్తంభించిన సంద్రంగాలి... నిద్రమత్తులో జోగుతూ... అలలు అలలుగా సాగుతోంది. రాత్రంతా జాబిల్లిని అందుకోను ఎగెసెగిసిపడిన కడలి, అలసిసొలసి ఆపసోపాలు పడుతూ... తీరం కుచ్చిళ్ళలో సేదతీరుతోంది. తెల్లారకముందే నిద్రలేపుతోన్న అమ్మ కుచ్చిళ్ళలో గునుస్తూ దాక్కున్న గారాబుబిడ్డలా.
ఇంకా వీడని చీకట్లలో, ఎడతెగని అలలనురుగులు అల్లనమెల్లన ఇసుకతిన్నెల్లోకి ఇంకిపోతున్నాయి. అతను గుండెలనిండా గాలిపీల్చి వదిలాడు.
ఇంతలో -
ఎవరో సిద్ధంగా ఉంచిన ప్రణాళిక లాగా... సమయ నిబద్దతను పాటిస్తూ... పక్షులు గూళ్ళల్లోంచి కువకువలాడుతూ లేచాయి. బద్దకంగా రెక్కలువిరుచుకొని, నీలాకాశంలోకి దూసుకెళ్ళాయి. గిరికీలుకొడుతూ... ఆ ముసిముసి చీకట్లరేవులో పాలనురుగులలో తానమాడాయి. అంతలోనే -
ఆ మహాసముద్రంలోని శక్తి అంతా వాటి రెక్కల్లోకి ప్రవేశించిందా అన్నట్టు... ఒక్కసారిగా పక్షుల గుంపుగుంపంతా పైకిలేచింది. వాటి విన్యాసాలన్నీ అపురూపంగా చూస్తూ ఉన్న అతని కళ్ళు, ఆ పక్షులను అనుసరించాయి.
అవి వెళ్ళినంతా వేగంగా అవి రెక్కలల్లాడ్చినంత చురుకుగా. అవి వెళ్ళినంతా మేరా.
అతను చూస్తూచూస్తూ ఉండగానే అవి అదృశ్యం అయిపోయాయి. చేరవలసిన తీరాలను చేరాయేమో! అరచేతులపై బరువానించి... ముంగాళ్ళపై పైకి లేచి... ఇంకా తెలవారని తూరుపుదిగంతం వైపే చూస్తున్నాడతను. ఏదో అద్భుతంకోసం ఎదురుచూస్తున్నట్లుగా. చూడగా చూడగా ఆ అద్భుతమేదో రానేవచ్చింది.
తూర్పుదిగంతాలకు వెళ్ళిన పక్షులు, వెనక్కి మళ్ళాయి. రెక్కలను సాచి... నిలకడగా... హూందాగా. మళ్ళీ తీరంవైపు. తమ దూదిరెక్కలతో క్షితిజరేఖను కప్పేస్తూ. సుశిక్షిత సైనిక కవాతులా సాగుతూ. అసంకల్పితంగా అతని ముఖంపై ఒక చిరునవ్వు కదలాడింది.
ఆ వెన్నమబ్బుల రెక్కల రథంపై ఎక్కివచ్చాడా అన్నట్లు, బుజ్జి సూరీడు, అల్లనమెల్లన ఆ అగాధ జలరాశిలోంచి ఆకాశంలోకి తొంగిచూశాడు. సముద్రంలో వసంతాన్ని చిలకరించినట్లుగా, తమ రెక్కలపల్లకిపై నారింజ రంగును మోస్తూవచ్చిన లెక్కకు మిక్కిలి పక్షులన్నీ, ఒక్కసారిగా బుడుంగున మునకవేసాయి.
నారింజరంగు అలలు పసిడివన్నెలద్దుకొంటూ... ఒకదాని పైనుంచి మరొకటి ఉరుకులు పరుగుల మీద ఒడ్డుని తాకి వెనక్కి తిరిగివెళుతున్నాయి. వచ్చినంత వేగంగా. అచ్చంగా పిల్లల పరుగుపందెంలోలాగా............
నీలి లోలాకు అతను చుట్టూచూశాడు. కనుచూపుమేరా. మౌనంగా. నీలార్జవం. అతనిచుట్టూ. అతనిలోలోన. ఆకాశం అంతా ఖాళీ అయ్యింది. మచ్చుకొక్కచుక్కయినా లేకుండా. అప్పటిదాకా స్తంభించిన సంద్రంగాలి... నిద్రమత్తులో జోగుతూ... అలలు అలలుగా సాగుతోంది. రాత్రంతా జాబిల్లిని అందుకోను ఎగెసెగిసిపడిన కడలి, అలసిసొలసి ఆపసోపాలు పడుతూ... తీరం కుచ్చిళ్ళలో సేదతీరుతోంది. తెల్లారకముందే నిద్రలేపుతోన్న అమ్మ కుచ్చిళ్ళలో గునుస్తూ దాక్కున్న గారాబుబిడ్డలా. ఇంకా వీడని చీకట్లలో, ఎడతెగని అలలనురుగులు అల్లనమెల్లన ఇసుకతిన్నెల్లోకి ఇంకిపోతున్నాయి. అతను గుండెలనిండా గాలిపీల్చి వదిలాడు. ఇంతలో - ఎవరో సిద్ధంగా ఉంచిన ప్రణాళిక లాగా... సమయ నిబద్దతను పాటిస్తూ... పక్షులు గూళ్ళల్లోంచి కువకువలాడుతూ లేచాయి. బద్దకంగా రెక్కలువిరుచుకొని, నీలాకాశంలోకి దూసుకెళ్ళాయి. గిరికీలుకొడుతూ... ఆ ముసిముసి చీకట్లరేవులో పాలనురుగులలో తానమాడాయి. అంతలోనే - ఆ మహాసముద్రంలోని శక్తి అంతా వాటి రెక్కల్లోకి ప్రవేశించిందా అన్నట్టు... ఒక్కసారిగా పక్షుల గుంపుగుంపంతా పైకిలేచింది. వాటి విన్యాసాలన్నీ అపురూపంగా చూస్తూ ఉన్న అతని కళ్ళు, ఆ పక్షులను అనుసరించాయి. అవి వెళ్ళినంతా వేగంగా అవి రెక్కలల్లాడ్చినంత చురుకుగా. అవి వెళ్ళినంతా మేరా. అతను చూస్తూచూస్తూ ఉండగానే అవి అదృశ్యం అయిపోయాయి. చేరవలసిన తీరాలను చేరాయేమో! అరచేతులపై బరువానించి... ముంగాళ్ళపై పైకి లేచి... ఇంకా తెలవారని తూరుపుదిగంతం వైపే చూస్తున్నాడతను. ఏదో అద్భుతంకోసం ఎదురుచూస్తున్నట్లుగా. చూడగా చూడగా ఆ అద్భుతమేదో రానేవచ్చింది. తూర్పుదిగంతాలకు వెళ్ళిన పక్షులు, వెనక్కి మళ్ళాయి. రెక్కలను సాచి... నిలకడగా... హూందాగా. మళ్ళీ తీరంవైపు. తమ దూదిరెక్కలతో క్షితిజరేఖను కప్పేస్తూ. సుశిక్షిత సైనిక కవాతులా సాగుతూ. అసంకల్పితంగా అతని ముఖంపై ఒక చిరునవ్వు కదలాడింది. ఆ వెన్నమబ్బుల రెక్కల రథంపై ఎక్కివచ్చాడా అన్నట్లు, బుజ్జి సూరీడు, అల్లనమెల్లన ఆ అగాధ జలరాశిలోంచి ఆకాశంలోకి తొంగిచూశాడు. సముద్రంలో వసంతాన్ని చిలకరించినట్లుగా, తమ రెక్కలపల్లకిపై నారింజ రంగును మోస్తూవచ్చిన లెక్కకు మిక్కిలి పక్షులన్నీ, ఒక్కసారిగా బుడుంగున మునకవేసాయి. నారింజరంగు అలలు పసిడివన్నెలద్దుకొంటూ... ఒకదాని పైనుంచి మరొకటి ఉరుకులు పరుగుల మీద ఒడ్డుని తాకి వెనక్కి తిరిగివెళుతున్నాయి. వచ్చినంత వేగంగా. అచ్చంగా పిల్లల పరుగుపందెంలోలాగా............© 2017,www.logili.com All Rights Reserved.