నామాట
కేంద్ర సాహిత్య అకాడమీ 'భారతీయ సాహిత్య నిర్మాతలు' పేరిట కమిటీ ఎంపిక చేసిన వారి 'మోనోగ్రాపు'లను కొందరు రచయితలు, రచయిత్రులతోనే రాయించి వాటిని వారే ప్రచురించుతూ వస్తున్నారు. అప్పటి సాహిత్య అకాడమీ కన్వీనరు. ఇతర సలహా సంఘ సభ్యుల సంప్రదింపులతో ఎంపిక చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో చాలా తక్కువ మంది రచయిత్రుల మీదే ఇంతవరకూ వచ్చాయి.
నేను కూడా డా|| శ్రీదేవి మోనోగ్రాఫు రాయటం దానిని 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించటం జరిగింది.
ఆ తర్వాత నాకు ముందుతరం రచయిత్రుల్లో అంతగా విమర్శకుల దృష్టికి రాని రచయిత్రులను 22మందిని ఎంపిక చేసుకొని, వారి కథలపై వ్యాసాలు రాసి గతంలో నేను 'కథారామంలో పూలతావులు' పేరిట సంపుటి ప్రచురించు కున్నాను.
ఆ సందర్భంలో నిడదవోలు మాలతి కథలు చదివాను. ఈమె 1979లోనే అమెరికా వెళ్ళిపోవటం (అప్పట్లో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన) అక్కడి నుండి ఇక్కడి పత్రికలకు కథలు పంపటం అసాధ్యమవడంతో ఆమె కథలు ప్రింటు మీడియాలో కనుమరుగయ్యాయనేది గమనించాను. మాలతి కథలు వెతుకులాటలో 'తెలుగు తూలికా.కామ్' పేరున స్వంత వెబ్ సైట్లో పొందుపరచిన ఆరు కథల సంపుటాలు లభ్యమయ్యాయి. అవేకాక ఎన్నెమ్మ కతలు' పేరున మరో అయిదు సంపుటాలు అందులో ఉన్నాయి. దాంతో ఆమె కథల గురించి ఒక వ్యాసం రాసి నా సంపుటిలో చేర్చాను.
మాడభూషి రంగాచార్య స్మారక పురస్కార సంస్థవారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటి జీవిస్తున్న రచయిత్రులను ఎంపిక చేసి, వారి కథల గురించి యాభై పేజీలకు తగ్గకుండా వ్యాసం రాయతల పెట్టారు. అందు నిమిత్తం నిడదవోలు మాలతి కథల గురించి రాయమని నన్ను కోరారు.
దాంతో ఉత్సాహంగా నిడదవోలు మాలతి కథల సంపుటాలు ఆరింటినీ, ఎన్నెమ్మ కతలు సంపుటాలు ఐదింటినీ వెబ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని రాసి పూర్తిచేశాక ఇంత ఎలాగూ కష్టపడ్డాను కదా మాలతి నవలలు రెండు ఉన్నాయని, ఆమె అయిదు వ్యాస సంపుటాలను కూడా చదివి రాసి నేనే మొతం................
నామాట కేంద్ర సాహిత్య అకాడమీ 'భారతీయ సాహిత్య నిర్మాతలు' పేరిట కమిటీ ఎంపిక చేసిన వారి 'మోనోగ్రాపు'లను కొందరు రచయితలు, రచయిత్రులతోనే రాయించి వాటిని వారే ప్రచురించుతూ వస్తున్నారు. అప్పటి సాహిత్య అకాడమీ కన్వీనరు. ఇతర సలహా సంఘ సభ్యుల సంప్రదింపులతో ఎంపిక చేస్తూ ఉంటారు. ఆ క్రమంలో చాలా తక్కువ మంది రచయిత్రుల మీదే ఇంతవరకూ వచ్చాయి. నేను కూడా డా|| శ్రీదేవి మోనోగ్రాఫు రాయటం దానిని 2015లో కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించటం జరిగింది. ఆ తర్వాత నాకు ముందుతరం రచయిత్రుల్లో అంతగా విమర్శకుల దృష్టికి రాని రచయిత్రులను 22మందిని ఎంపిక చేసుకొని, వారి కథలపై వ్యాసాలు రాసి గతంలో నేను 'కథారామంలో పూలతావులు' పేరిట సంపుటి ప్రచురించు కున్నాను. ఆ సందర్భంలో నిడదవోలు మాలతి కథలు చదివాను. ఈమె 1979లోనే అమెరికా వెళ్ళిపోవటం (అప్పట్లో టెక్నాలజీ అందుబాటులో లేకపోవడం వలన) అక్కడి నుండి ఇక్కడి పత్రికలకు కథలు పంపటం అసాధ్యమవడంతో ఆమె కథలు ప్రింటు మీడియాలో కనుమరుగయ్యాయనేది గమనించాను. మాలతి కథలు వెతుకులాటలో 'తెలుగు తూలికా.కామ్' పేరున స్వంత వెబ్ సైట్లో పొందుపరచిన ఆరు కథల సంపుటాలు లభ్యమయ్యాయి. అవేకాక ఎన్నెమ్మ కతలు' పేరున మరో అయిదు సంపుటాలు అందులో ఉన్నాయి. దాంతో ఆమె కథల గురించి ఒక వ్యాసం రాసి నా సంపుటిలో చేర్చాను. మాడభూషి రంగాచార్య స్మారక పురస్కార సంస్థవారు డెబ్బై ఐదు ఏళ్ళు దాటి జీవిస్తున్న రచయిత్రులను ఎంపిక చేసి, వారి కథల గురించి యాభై పేజీలకు తగ్గకుండా వ్యాసం రాయతల పెట్టారు. అందు నిమిత్తం నిడదవోలు మాలతి కథల గురించి రాయమని నన్ను కోరారు. దాంతో ఉత్సాహంగా నిడదవోలు మాలతి కథల సంపుటాలు ఆరింటినీ, ఎన్నెమ్మ కతలు సంపుటాలు ఐదింటినీ వెబ్ సైట్ నుండి దిగుమతి చేసుకొని రాసి పూర్తిచేశాక ఇంత ఎలాగూ కష్టపడ్డాను కదా మాలతి నవలలు రెండు ఉన్నాయని, ఆమె అయిదు వ్యాస సంపుటాలను కూడా చదివి రాసి నేనే మొతం................© 2017,www.logili.com All Rights Reserved.