ఈ ఒక్కటి చదివేసి, మొదలెట్టండి..
ఈ నృకేసరి నా మొదటి నవల. ఈ కథ ఎలా పుట్టింది, ఎలా ఇంత విస్తృతంగా మారింది, ఇందులోని ఆసక్తికరమైన విషయాలు అన్నీ మీరు ఈ పుస్తకం చదివాక హాయిగా మాట్లాడుకుందాం. నా వివరాలు పక్క పేజీలోనే ఉన్నాయి చూడండి.
అయితే, ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే.. ఇది ఆధ్యాత్మిక పుస్తకమో లేక మంచి చెడుల మధ్య గీతలు గీస్తూ సందేశాత్మకంగా సాగే పుస్తకమో కాదు. ఇది కేవలం భాగవతంపై నాకున్న ఇష్టం వల్ల, చిన్నతనం నుండి చూసిన, చదివిన కొన్ని కథల వల్ల, సినిమాల కారణంగా నాకు మాయలు, ఎలివేషన్స్, డ్రామాలపై ఉన్న కుతూహలన్నీ, 2020 లో నన్ను కలగా పలకరించిన ఒక ఆలోచనని కలగలిపి సృష్టించిన ఓ కథ.. అంతే.
నాదొక్కటే మనవి. దయచేసి ఈ కథాంశంలోని విషయాలను మీ స్వంత వాదాల చర్చల్లోకి లాగి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరూ ఇబ్బంది పడకండి. అన్నీ మరచిపోయి హాయిగా ఓ సినిమా చూస్తున్నట్టు ఈ పుస్తకాన్ని అలా అలా చదివేసేయండి. ఒకవేళ మీ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతింటే, అది నేను కావాలని చేసిన పని కాదని ముందే చెప్పేస్తున్నాను.
ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పదండి పదండి.................
ఈ ఒక్కటి చదివేసి, మొదలెట్టండి.. ఈ నృకేసరి నా మొదటి నవల. ఈ కథ ఎలా పుట్టింది, ఎలా ఇంత విస్తృతంగా మారింది, ఇందులోని ఆసక్తికరమైన విషయాలు అన్నీ మీరు ఈ పుస్తకం చదివాక హాయిగా మాట్లాడుకుందాం. నా వివరాలు పక్క పేజీలోనే ఉన్నాయి చూడండి. అయితే, ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే.. ఇది ఆధ్యాత్మిక పుస్తకమో లేక మంచి చెడుల మధ్య గీతలు గీస్తూ సందేశాత్మకంగా సాగే పుస్తకమో కాదు. ఇది కేవలం భాగవతంపై నాకున్న ఇష్టం వల్ల, చిన్నతనం నుండి చూసిన, చదివిన కొన్ని కథల వల్ల, సినిమాల కారణంగా నాకు మాయలు, ఎలివేషన్స్, డ్రామాలపై ఉన్న కుతూహలన్నీ, 2020 లో నన్ను కలగా పలకరించిన ఒక ఆలోచనని కలగలిపి సృష్టించిన ఓ కథ.. అంతే. నాదొక్కటే మనవి. దయచేసి ఈ కథాంశంలోని విషయాలను మీ స్వంత వాదాల చర్చల్లోకి లాగి నన్ను ఇబ్బంది పెట్టకండి, మీరూ ఇబ్బంది పడకండి. అన్నీ మరచిపోయి హాయిగా ఓ సినిమా చూస్తున్నట్టు ఈ పుస్తకాన్ని అలా అలా చదివేసేయండి. ఒకవేళ మీ మనోభావాలు ఎక్కడైనా దెబ్బతింటే, అది నేను కావాలని చేసిన పని కాదని ముందే చెప్పేస్తున్నాను. ఇప్పటికే బాగా ఆలస్యమైంది. పదండి పదండి.................© 2017,www.logili.com All Rights Reserved.