సూర్యోదయ సమయం కూడా ఆ అడవిలో చీకట్లను పూర్తిగా పారదోలలేక పోతోంది. సూర్యకిరణాలు తమ ప్రభావం చూపాలనే కోరికతో ఆ ప్రభాతవేళ అతి చురుకుగా, తీక్షణంగా ప్రసరిస్తున్నాయి. ఆ అడవిలో పట్టపగటి కాంతికి పట్టం కట్టాలనే కోరిక సూర్య భగవానుడికి ఎప్పటి నుండో ఉంది. కానీ ఆ కోరిక నెరవేరటానికి ఆయన శక్తే ఆయనకు అడ్డమై కూచుంది. అర్కుడు. విజృంభించిన కొద్దీ అరణ్యంలో లేత మొక్కలు ధృడంగా పెరుగుతాయి. పెరిగిన చెట్లు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. శాఖాగ్రాలు సూర్యకాంతిని మరింతగా తాగి మదించి మహావృక్షాలవుతాయి. అతి సన్నని దారులను మాత్రం వదిలి కిరణ ప్రవాహాల విచ్చలవిడి విహారానికి వీలు లేకుండా చేసి వృక్షాలు ఆకాశానికి పందిరి వేస్తాయి. వందల సంవత్సరాల వయస్సున్న ఆ మహా వృక్షాలు మళ్ళీ సూర్యుని పట్ల స్నేహాన్ని, గౌరవాన్నీ ప్రకటిస్తూ శిరసు వంచుతాయి. తలలూపుతాయి. సూర్యుడు కరుణిస్తాడు. మెల్లిగా మేఘాలలోకి తప్పుకుంటాడు. మేఘాలకు ఆ అరణ్యమంటే ఎంత ప్రేమంటే చివరిబొట్టు వరకూ కురిసే వెళ్తాయి. వృక్షాలు ప్రేమ ధారలతో తడిసి ముద్దయిపోయి ఆ బలంతో మరింత పెరుగుతాయి. ఆ నీటినంతా తాగలేక భూమాత విసుక్కుంటూనే ఒక దారిచేసి చిన్న చిన్న కాలువలుగా పంపానదిలోకి పంపుతుంది. దూరాన కొండల మీది జలపాతాలూ పంపలోకే వచ్చి దూకుతాయి. పంపానదీ సమీపాటవులన్నీ సకల జీవరాసులతో కళకళలాడుతుంటాయి.
ఆ ఉదయాన పక్షుల కూతలు, నెమిళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలతో అరణ్యమంతా సందడిగా ఉంది. మట్టి, రావి, చెట్ల కింద ఆ మానుల రంగుతో కలిసిపోయే శరీరకాంతితో ఏనుగులు వచ్చి చేరాయి. తమ...............
పంపా తీరం సూర్యోదయ సమయం కూడా ఆ అడవిలో చీకట్లను పూర్తిగా పారదోలలేక పోతోంది. సూర్యకిరణాలు తమ ప్రభావం చూపాలనే కోరికతో ఆ ప్రభాతవేళ అతి చురుకుగా, తీక్షణంగా ప్రసరిస్తున్నాయి. ఆ అడవిలో పట్టపగటి కాంతికి పట్టం కట్టాలనే కోరిక సూర్య భగవానుడికి ఎప్పటి నుండో ఉంది. కానీ ఆ కోరిక నెరవేరటానికి ఆయన శక్తే ఆయనకు అడ్డమై కూచుంది. అర్కుడు. విజృంభించిన కొద్దీ అరణ్యంలో లేత మొక్కలు ధృడంగా పెరుగుతాయి. పెరిగిన చెట్లు శాఖోపశాఖలుగా విస్తరిస్తాయి. శాఖాగ్రాలు సూర్యకాంతిని మరింతగా తాగి మదించి మహావృక్షాలవుతాయి. అతి సన్నని దారులను మాత్రం వదిలి కిరణ ప్రవాహాల విచ్చలవిడి విహారానికి వీలు లేకుండా చేసి వృక్షాలు ఆకాశానికి పందిరి వేస్తాయి. వందల సంవత్సరాల వయస్సున్న ఆ మహా వృక్షాలు మళ్ళీ సూర్యుని పట్ల స్నేహాన్ని, గౌరవాన్నీ ప్రకటిస్తూ శిరసు వంచుతాయి. తలలూపుతాయి. సూర్యుడు కరుణిస్తాడు. మెల్లిగా మేఘాలలోకి తప్పుకుంటాడు. మేఘాలకు ఆ అరణ్యమంటే ఎంత ప్రేమంటే చివరిబొట్టు వరకూ కురిసే వెళ్తాయి. వృక్షాలు ప్రేమ ధారలతో తడిసి ముద్దయిపోయి ఆ బలంతో మరింత పెరుగుతాయి. ఆ నీటినంతా తాగలేక భూమాత విసుక్కుంటూనే ఒక దారిచేసి చిన్న చిన్న కాలువలుగా పంపానదిలోకి పంపుతుంది. దూరాన కొండల మీది జలపాతాలూ పంపలోకే వచ్చి దూకుతాయి. పంపానదీ సమీపాటవులన్నీ సకల జీవరాసులతో కళకళలాడుతుంటాయి. ఆ ఉదయాన పక్షుల కూతలు, నెమిళ్ళ క్రేంకారాలు, ఏనుగుల ఘీంకారాలతో అరణ్యమంతా సందడిగా ఉంది. మట్టి, రావి, చెట్ల కింద ఆ మానుల రంగుతో కలిసిపోయే శరీరకాంతితో ఏనుగులు వచ్చి చేరాయి. తమ...............© 2017,www.logili.com All Rights Reserved.