అద్దంలో సమాజం
కొన్ని నవలలను చదవడానికి ఆలోచిస్తాం. మరికొన్ని నవలలను చదివాక ఆలోచిస్తాం. కొన్ని నవలలను కొద్ది రోజుల తర్వాత మర్చిపోతాం. కొన్ని నవలలే మనసులో ఫోటో లాగా ముద్రించుకుపోతాయి. అట్లా ముద్రించుకు పోయే నవల ఈ ఫోటో. ఒక చిన్న కుటుంబాన్ని నేపథ్యంగా తీసుకుని ఒక చిన్న పిల్ల వెంట కథను నడిపిస్తూ ప్రస్తుత సమాజాన్ని, మనుషులను సంక్షోభ జీవితాలను కళ్ళకు కట్టినట్టు అక్షరాలతో ఫోటో తీసి మరీ చూపిస్తుంది రచయిత్రి.
ఇందులో ప్రధాన పాత్ర ఒక చిన్న పిల్ల లచ్చిమి. ముక్కు పచ్చలారని ముద్దు మురిపాల బాల ఆమెది. ప్రపంచమంతా ఓ పూలతోట అనుకుని తాను అందులో ఎగిరే ఓ సీతాకోక చిలుక అనుకునే వయసు. ఎల్లి ఎల్లని సంసారాన్ని ఎల్లదీయడానికి నానా యాతనలు పడుతున్న బతుకు ఆమె తల్లి యాదమ్మది. దేశంలో ఎనబై శాతం ఉన్నట్టే బాధ్యత లేకుండా తింటూ తాగుతూ కనీసం కూతుర్ని చదివించుకోవాలనే జ్ఞానం లేకుండా పనిలో పెట్టాలని చూస్తూ తల్లీబిడ్డల కష్టం దోచుకునే నీచమైన బుద్ధి తండ్రి వీరయ్యది.
ఎందుకు బతుకుతున్నామో తెలిసి బతుకు అర్థానికి నిలువెత్తు రూపంలా నిలిచినది నిరుపేద అరటి పళ్ళ తాత. రంగురంగుల సీతాకోక చిలుక లాంటి బాల్యాన్ని ఇనుప కాళ్ళ కింద నలిపేస్తున్న బుద్ధి పెద్ద పెద్ద బంగళాలలో ఉన్న యజమానులది. అటు పినతల్లి ఇటు యజమానురాలి కర్కశ కాళ్ళ కింద పువ్వులా నలిగిపోతున్న బాల్యం రంగిది. ఊరేదో తెలియని యెక్కడుంటున్నామో తెలియని వ్యధాభరిత బతుకులు మాఫియాకు చిక్కిన చిన్న పిల్లలవి. వాళ్లని ఎత్తుకొచ్చి బంధించి మానవత్వాన్ని మరిచి పనులు చేయించుకుని డబ్బులు పోగేసుకుంటున్న మృగాల బతుకులు మాఫియాలవి. వీటన్నింటిని నవలలో హృద్యంగా పరిచయం చేస్తూ వర్తమాన సమాజాన్ని చూపిస్తుంది రచయిత్రి.................
అద్దంలో సమాజం కొన్ని నవలలను చదవడానికి ఆలోచిస్తాం. మరికొన్ని నవలలను చదివాక ఆలోచిస్తాం. కొన్ని నవలలను కొద్ది రోజుల తర్వాత మర్చిపోతాం. కొన్ని నవలలే మనసులో ఫోటో లాగా ముద్రించుకుపోతాయి. అట్లా ముద్రించుకు పోయే నవల ఈ ఫోటో. ఒక చిన్న కుటుంబాన్ని నేపథ్యంగా తీసుకుని ఒక చిన్న పిల్ల వెంట కథను నడిపిస్తూ ప్రస్తుత సమాజాన్ని, మనుషులను సంక్షోభ జీవితాలను కళ్ళకు కట్టినట్టు అక్షరాలతో ఫోటో తీసి మరీ చూపిస్తుంది రచయిత్రి. ఇందులో ప్రధాన పాత్ర ఒక చిన్న పిల్ల లచ్చిమి. ముక్కు పచ్చలారని ముద్దు మురిపాల బాల ఆమెది. ప్రపంచమంతా ఓ పూలతోట అనుకుని తాను అందులో ఎగిరే ఓ సీతాకోక చిలుక అనుకునే వయసు. ఎల్లి ఎల్లని సంసారాన్ని ఎల్లదీయడానికి నానా యాతనలు పడుతున్న బతుకు ఆమె తల్లి యాదమ్మది. దేశంలో ఎనబై శాతం ఉన్నట్టే బాధ్యత లేకుండా తింటూ తాగుతూ కనీసం కూతుర్ని చదివించుకోవాలనే జ్ఞానం లేకుండా పనిలో పెట్టాలని చూస్తూ తల్లీబిడ్డల కష్టం దోచుకునే నీచమైన బుద్ధి తండ్రి వీరయ్యది. ఎందుకు బతుకుతున్నామో తెలిసి బతుకు అర్థానికి నిలువెత్తు రూపంలా నిలిచినది నిరుపేద అరటి పళ్ళ తాత. రంగురంగుల సీతాకోక చిలుక లాంటి బాల్యాన్ని ఇనుప కాళ్ళ కింద నలిపేస్తున్న బుద్ధి పెద్ద పెద్ద బంగళాలలో ఉన్న యజమానులది. అటు పినతల్లి ఇటు యజమానురాలి కర్కశ కాళ్ళ కింద పువ్వులా నలిగిపోతున్న బాల్యం రంగిది. ఊరేదో తెలియని యెక్కడుంటున్నామో తెలియని వ్యధాభరిత బతుకులు మాఫియాకు చిక్కిన చిన్న పిల్లలవి. వాళ్లని ఎత్తుకొచ్చి బంధించి మానవత్వాన్ని మరిచి పనులు చేయించుకుని డబ్బులు పోగేసుకుంటున్న మృగాల బతుకులు మాఫియాలవి. వీటన్నింటిని నవలలో హృద్యంగా పరిచయం చేస్తూ వర్తమాన సమాజాన్ని చూపిస్తుంది రచయిత్రి.................© 2017,www.logili.com All Rights Reserved.