గోడల వంటి మాటలు
డప్పుని గుండెల కానించుకుని కష్టపడి పరిగెడుతున్నాడు చిక్క మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు అతని శరీరాన్ని మాడ్చేస్తున్నాడు. కానీ చిక్క ఆగలేదు. అతను తప్పించుకుని వెళ్లాల్సిందే.
ఆ వాడ అంచునున్న నీటి మడుగు (చెరువు) దగ్గరకు దాదాపుగా వచ్చాడు. పాడుబడ్డట్టుగా ఉన్న ఆ పూరిగుడిసెల సమూహాన్ని ఒక ఊరు అని ఎవరూ చెప్పలేరు. పిలవలేరు. చిక్క ఊపిరి పీల్చుకునేందుకు ఆగాడు. కడుపు ఎంత ఖాళీగా ఉందంటే ఆకలితో నొప్పి పుడుతోంది. గుండె వేగంగా పెద్దగా కొట్టుకుంటోంది. నీటి మడుగు దగ్గర ఎవరూ లేరు. మురికి కుక్క ఒకటి చెత్తలోపల నిద్ర పోతూ ఉంది. కాసేపు అతనిక్కడ ఒంటరిగా ఉండొచ్చు.
చిక్కనేల మీద కూలబడి ఆ నీళ్ళ వారగా పొట్టమీద పడుకున్నాడు. మట్టి గట్టిగా వేడిగా ఉంది. ఆ నేల, కలల్లో మాత్రమే కనిపించిన అతని తల్లిలా ఉంది. వాళ్ళ ఒంటి రంగు ఒకటే. పరిచయం లేని తల్లులు ఇలాగే ఉంటారేమో; అతని కాళ్ళ కింద పరిచయమైన మట్టి అలాగే అనిపిస్తోంది. ఆ మట్టి తన వీపుమీద వెయ్యి శరీరాలనూ, వాటి అంతులేని, అసంఖ్యాకమైన వేదనలను మోయగలదు.
చిక్కకు, ఈ గట్టి గుండె గల తల్లి కౌగిలిలో ఎప్పటికీ ఇలాగే పడుకోవాలని అనిపించింది. లేదా ఈ మట్టిమీద తాను ఒక్కడే ఒంటరిగా ఉన్నంత సేపూ, ఊరి జనం తన తండ్రిని సమాధి చేసి ఆ వెళ్ళిపోయినవాడి జ్ఞాపకార్థం తిండి తిని తిరిగి వచ్చేంత..........
గోడల వంటి మాటలు డప్పుని గుండెల కానించుకుని కష్టపడి పరిగెడుతున్నాడు చిక్క మిట్ట మధ్యాహ్నపు సూర్యుడు అతని శరీరాన్ని మాడ్చేస్తున్నాడు. కానీ చిక్క ఆగలేదు. అతను తప్పించుకుని వెళ్లాల్సిందే. ఆ వాడ అంచునున్న నీటి మడుగు (చెరువు) దగ్గరకు దాదాపుగా వచ్చాడు. పాడుబడ్డట్టుగా ఉన్న ఆ పూరిగుడిసెల సమూహాన్ని ఒక ఊరు అని ఎవరూ చెప్పలేరు. పిలవలేరు. చిక్క ఊపిరి పీల్చుకునేందుకు ఆగాడు. కడుపు ఎంత ఖాళీగా ఉందంటే ఆకలితో నొప్పి పుడుతోంది. గుండె వేగంగా పెద్దగా కొట్టుకుంటోంది. నీటి మడుగు దగ్గర ఎవరూ లేరు. మురికి కుక్క ఒకటి చెత్తలోపల నిద్ర పోతూ ఉంది. కాసేపు అతనిక్కడ ఒంటరిగా ఉండొచ్చు. చిక్కనేల మీద కూలబడి ఆ నీళ్ళ వారగా పొట్టమీద పడుకున్నాడు. మట్టి గట్టిగా వేడిగా ఉంది. ఆ నేల, కలల్లో మాత్రమే కనిపించిన అతని తల్లిలా ఉంది. వాళ్ళ ఒంటి రంగు ఒకటే. పరిచయం లేని తల్లులు ఇలాగే ఉంటారేమో; అతని కాళ్ళ కింద పరిచయమైన మట్టి అలాగే అనిపిస్తోంది. ఆ మట్టి తన వీపుమీద వెయ్యి శరీరాలనూ, వాటి అంతులేని, అసంఖ్యాకమైన వేదనలను మోయగలదు. చిక్కకు, ఈ గట్టి గుండె గల తల్లి కౌగిలిలో ఎప్పటికీ ఇలాగే పడుకోవాలని అనిపించింది. లేదా ఈ మట్టిమీద తాను ఒక్కడే ఒంటరిగా ఉన్నంత సేపూ, ఊరి జనం తన తండ్రిని సమాధి చేసి ఆ వెళ్ళిపోయినవాడి జ్ఞాపకార్థం తిండి తిని తిరిగి వచ్చేంత..........© 2017,www.logili.com All Rights Reserved.